వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాజికల్‌గా ఒక్కమాటే.. సివిల్స్ టాపర్ నా గురించి ఏం చెప్పాడో చూడండి: వర్మ (వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

Civils Topper Inspires From Ram Gopal Varma

హైదరాబాద్: సివిల్స్ పరీక్షల్లో 624వ ర్యాంకు సాధించిన యెడవల్లి అక్షయ్ కుమార్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్మ లేకుంటే తనకు జీవితం లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వర్మ ఆలోచన చాలా భిన్నంగా,లాజికల్‌గా ఉంటుందన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను వర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఫెయిల్ అయిన సివిల్ ఇంజనీర్ వర్మను సివిల్ టాపర్ అక్షయ్ కుమార్ స్ఫూర్తిగా తీసుకున్నారని, అక్షయ్‌ను నేను కలవాలనుకుంటున్నానని, ఆయనతో చదువు గురించి మాట్లాడాలనుకుంటున్నానని వర్మ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సివిల్స్ వైపు రావడానికి స్ఫూర్తి ఎవరని ప్రశ్నించగా

సివిల్స్ వైపు రావడానికి స్ఫూర్తి ఎవరని ప్రశ్నించగా

సివిల్స్ వైపు రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు అని ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా అక్షయ్ ఈ విధంగా స్పందించారు. కొంతమంది వ్యక్తులను చూసి తన ఆలోచనలు మారాయని, ఇప్పుడు తనకు కోపం రాదని, మన ఆలోచనలు స్వేచ్ఛగా ఉండాలని, తానెప్పుడూ ఎవరి అభిప్రాయం వారిది అనుకుంటానని, ఇదే సూత్రం సివిల్స్ సిలబస్ చదవడాన్ని తనకు సులభతరం చేసిందని అక్షయ్ చెప్పారు.

వర్మను ఎంతగా ఫాలో అయ్యేవాడిని అంటే

తన ఆలోచనలు ఇలా ఉండటానికి ఓ వ్యక్తి కారణమని, అతనే ప్రముఖ వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని అక్షయ్ వెల్లడించారు. తాను ఆయనను నిత్యం ఫాలో అయ్యేవాడినని, ఎంత ఫాలో అయ్యేవాడినో మాటలలో చెప్పలేనని, ఇప్పటికీ రేపు నా పరీక్ష ఉన్నా ఈ రోజు యూట్యూబ్‌లో వర్మ వీడియో వస్తే దానిని చూడకుండా పరీక్ష రాయలేనని వెల్లడించారు.

వర్మ లాజికల్‌గా ఒక్కటే మాట్లాడుతారు

వర్మ లాజికల్‌గా ఒక్కటే మాట్లాడుతారు

రామ్ గోపాల్ వర్మ, తన రంగాలా చాలా భిన్నమైనవని అక్షయ్ అన్నారు. కానీ అది ముఖ్యం కాదన్నారు. ఓ టాపిక్‌ను లాజిక్‌గా మాట్లాడటం వర్మ నుంచి నేర్చుకున్నానని, పదిమంది ఒకటి మాట్లాడితే, ఆయన ఒకటి మాట్లాడుతారని, ఆయన ఏం మాట్లాడినా లాజికల్‌గా ఉంటుందని, ఓ కారణం ఉంటుందని, అవకాశం వస్తే వర్మను కలుస్తానని, ఆయన లేకపోతే నా జీవితం లేదని, వర్మ అంతలా తనను ప్రభావితం చేశారని, నా స్నేహితులు కూడా వర్మ అంటే ఇష్టపడేలా చేశానని నవ్వుతూ చెప్పారు.

ఈ వీడియో చూసి పాఠం నేర్చుకోవాలని వర్మ

అక్షయ్ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసి వీడియోలో ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చూడాలో కూడా సూచించారు. నేరస్తులను ప్రభావితం చేసే వ్యక్తిగా తనను అందరూ చూస్తారని, ఈ సివిల్ టాపర్‌ను చూసిన తర్వాతనైనా పాఠం నేర్చుకుంటారని అనుకుంటున్నానని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఆకతాయిగా తిరుగుతూ సివిల్ ఇంజినీరింగులో రెండుసార్లు ఫెయిల్ అయిన తనకు ఈ విషయం గర్వంగా ఉందన్నారు.

English summary
Civils Topper Yedavelli Akshay Kumar praises Director Ram Gopal Varma in an interview.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X