హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రిమినల్ కేసు పెడ్తా: టీవీ9, రజినీకాంత్‌పై రాంగోపాల్ వర్మ నిప్పులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

RGV To Files A Case Against TV9

హైదరాబాద్: తెలుగు వార్తా ఛానల్ 'టీవీ9'పై క్రిమినల్ కేసు పెట్టనున్నట్టు మంగళవారం ఉదయం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హెచ్చరించారు. మరో ట్వీట్ పెడుతూ ఆ ఛానల్ యాంకర్ రజనీకాంత్‌పై కూడా నిప్పులు చెరిగాడు.

నిజాలను నాశనం చేస్తూ.. రజినీకాంత్ తప్పుడు వార్తా కథనాలను ప్రసారం చేయిస్తున్నారని వర్మ ఆరోపించారు. అసత్యాలను ప్రసారం చేస్తూ, తనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీవీ9కి హెచ్చరిక

ఓ నేరంపై విచారణ జరుగుతూ ఉండగా, 'విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు' అంటూ వార్తలు అందించడం కూడా నేరమేనని.. అతి త్వరలో 'టీవీ9' భారత చట్టాలను ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించాడు.

దేవికి క్షమాపణలు చెప్పినట్లు వార్తలు

గత శనివారం నాడు జీఎస్టీ(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్), దేవీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసుల నేపథ్యంలో సీసీఎస్ పోలీసుల విచారణకు వర్మ హాజరైన విషయం తెలిసిందే. కాగా, మహిళా సంఘం నేతలపై చేసిన అసభ్యకర కామెంట్స్ పై శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, దేవికి వర్మ క్షమాపణ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

మీడియా వార్తలపై వర్మ ఆగ్రహం

మీడియా వార్తలపై వర్మ ఆగ్రహం

హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణ తరువాత మీడియాలో వస్తున్న వార్తలపై రాంగోపాల్ వర్మ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీఎస్టీ చిత్రాన్ని తాను తీయలేదని, స్క్రిప్టును మాత్రమే ఇచ్చానని పోలీసులకు చెప్పానని పలు వార్తా ఛానళ్లు, పత్రికల్లో వార్తలు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. దాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. తాను సినిమా నిర్మాణంలోనూ భాగస్వామినేనని చెప్పాడు. సినిమాకు తాను సాంకేతిక సహకారాన్ని మాత్రమే ఇచ్చానని ఎలా రాస్తారని ప్రశ్నించాడు.

వర్మా! ఏంటీ ‘జీఎస్టీ'?: పోలీసుల ప్రశ్నల వర్షం, ఇవే!, ‘పోలీస్'నవుతానంటూ ట్వీట్ వర్మా! ఏంటీ ‘జీఎస్టీ'?: పోలీసుల ప్రశ్నల వర్షం, ఇవే!, ‘పోలీస్'నవుతానంటూ ట్వీట్

టీవీ9 ఓ జోకర్ ఛానలంటూ

టీవీ9 ఓ జోకర్ ఛానలంటూ

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వర్మ ఓ పోస్టును పెడుతూ.. ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనాన్ని పోస్టు చేశారు. అలాగే టీవీ9 పై తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. టవీ9 ఒక సర్కస్ జోకర్ ఛానెల్ అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అంతేగాక, ‘నిజాయితీ'పై ఓ పోల్‌ పెట్టగా తనకు 85శాతం మంది మద్దతు పలుకగా, రజినీకాంత్‌కు 15శాతం మందే మద్దతుగా నిలిచారని వర్మ పేర్కొన్నారు.

English summary
Maverick director Ram Gopal Varma made a sensational tweet saying he is planning to file case on TV9 for distorting facts about him and cases on him. He announced that he is consulting with his lawyers currently for proceeding on case against TV9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X