వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రాకపై శశిధర్ ఇలా: చాలా మంది వస్తారంటూ కుంతియా కీలక వ్యాఖ్యలు

టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతమవుతోందని అన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతమవుతోందని అన్నారు. పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.

క్యూలో చాలా మంది నేతలు

క్యూలో చాలా మంది నేతలు

అంతేగాక, ఇతర పార్టీల నుంచి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని కుంతియా అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడటం అసాధ్యమని అన్నారు. అమిత్ షా వల్లే తెలంగాణలో బీజేపీ బలహీనపడిందని అన్నారు.

2019లో మాదే అధికారం..

2019లో మాదే అధికారం..

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని కుంతియా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో బలమైన ప్రతిపక్షం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు లేవని అన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీదేని కుంతియా అన్నారు.

Recommended Video

రేవంత్ మనసు నుంచి సంచలనాలు : కేసీఆర్, పరిటాల, యనమల పై హాట్ కామెంట్స్ | Oneindia Telugu
ఖాయంగానే రేవంత్..

ఖాయంగానే రేవంత్..

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. రెండ్రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన రేవంత్ కొందరు కాంగ్రెస్ ముఖ్యనేతలతో పాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. అంతేగాక, ఏపీ టీడీపీ నేతలపై బుధవారం సాయంత్రం తీవ్ర విమర్శలు చేయంతో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరుతున్నట్లు ఖాయమైనట్లేని తెలుస్తోంది. అయితే ఎప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

రేవంత్ రాకపై శశిధర్ రెడ్డి

రేవంత్ రాకపై శశిధర్ రెడ్డి

ఇదిఇలావుంటే.. రేవంత్ రాకను అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు వ్యతిరేకిస్తుండగా మరికొందరు నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు. తాజాగా, ఇదే విషయమై కాంగ్రెస్ నేత మర్రి శశిదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ పార్టీలోకి వస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. రేవంత్‌ను పార్టీలో చేర్చుకోవడంపై అధిష్టానం నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
పార్టీలోకి ఎవరొచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.ఓటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు జరిగాయని, ఇంటింటి ఓటర్ల సర్వే సక్రమంగా చేయలేదన్నారు. మరోసారి పకడ్బందీగా సర్వే నిర్వహించాలని శశిధర్ డిమాండ్ చేశారు.

English summary
Telangana Congress in-charge Ramachandra khuntia and leader Marri shashidhar Reddy on Wednesday responded on stat Congress situation When Revanth Reddy likely to join Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X