• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ అందం చూస్తే ఇవాంకా షాక్ తినడం ఖాయం: వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

By Ramesh Babu
|
  కేసీఆర్, ఇవాంక : మీరెవరిని చూస్తారు ? నేనయితే kcr ని చూస్తా ! వర్మ

  హైదరాబాద్: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ చివరికి ఇవాంకా ట్రంప్ ను కూడా వదిలిపెట్టలేదు. ఆమె హైదరాబాద్‌కు రాకమునుపే వర్మ తన వ్యాఖ్యానం మొదలెట్టేశారు.

  హైదరాబాద్‌లో ఈ నెల 28 నుంచి జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ 2017కు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా విచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమె రాక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

  kcr-ivanka-varma

  ఇవాంకా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌ను అత్యంత సుందరంగా అలకరిస్తున్నారు. అంతేకాదు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. నెల రోజుల కిందటే అమెరికా భద్రతాధికారులు ఇక్కడకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

  దీనిపై వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

  ఇవాంకా అందాన్ని బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ అందంతో పోల్చుతూ గతంలో వ్యాఖ్యానించిన ఆయన తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా ఇందులోకి లాగారు.

  ''ఇవాంకాకు తాను అందంగా ఉంటానన్న అహంకారం ఎక్కువ. అయితే, గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అందాన్ని చూసి ఆమె షాక్‌ అవ్వడం ఖాయం. కేసీఆర్, ఇవాంక పక్కపక్కన కూర్చుంటారు కాబట్టి, అప్పుడు ఇవాంకాను ఎవరూ చూడరని బెట్ కాస్తాను..'' అంటూ వర్మ వ్యాఖ్మానించారు.

  అంతేకాదు, ''ఇవాంకాకు అంతర్జాతీయ అందగత్తెగా, మొత్తం కుటుంబం చూడతగ్గ ఉత్తమ అందగత్తెగా, ఉత్తమ ప్రపంచ సుందరి నాయకురాలిగా.. మూడు స్పెషల్ జ్యూరీ నంది అవార్డులు కూడా ఇవ్వాలి..'' అంటూ తన పోస్ట్ లో ఆయన వ్యాఖ్యానించారు.

  ఇంకా.. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌పై కూడా వర్మ తనదైన శైలిలో కామెంట్స్ పోస్ట్ చేశారు. ''నేను చాలా నిరక్ష్యరాస్యుణ్ని... గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌ శాఖల గురించి అవగాహన చేసుకోలేను.. కానీ, అధ్యక్షుడికి ప్రధాన సలహారుగా ఉన్నంత మాత్రాన ఇవాంకాకు ఇవన్నీ అర్థమవుతాయనుకోవడం అవివేకం..'' అని అన్నారు.

  అయితే ఈ సదస్సుకు హాజరయ్యే ఇతర నాయకులతో పోల్చుకుంటే ఆమె గొప్ప అందగత్తె అని తాను ఒప్పుకుంటానని వర్మ పోస్ట్ చేశాడు. ఒకవేళ ఇవాంకా ట్రంప్ అందంగా లేకపోతే ఇంత హంగామా చేసేవారా? అని ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రశ్నించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Sensational film maker Ram Gopal Varma is thrilled about Ivanka Trump’s arrival. He posted on the wall of Facebook, “Beng dumb and also mentally challenged on a political level,I don’t really get the purpose of Ivanka Trump’s purpose of visiting Hyderabad for the global entrepeanours summit but purely as a man I am thrilled that I can get to see her awesome figure in real. The last time I got such a huge thrill was when Sunny Leone came to india.” He also posted on the wall of facebook that Ivanka will get shocked after seen the beauty of our CM KCR.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more