హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీరు సూపర్, కానీ మరొకటి: కేసీఆర్‌ను ఓ కోరిక కోరిన రామోజీరావు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఇటీవల ఓ లేఖ రాశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఇటీవల ఓ లేఖ రాశారు.

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నందుకు, అలాగే, తెలుగు భాష పట్ల చూపుతున్న అభిమానానికి రామోజీ రావు ఈ లేఖ రాశారు.

నభూతో అన్న చందంగా

నభూతో అన్న చందంగా

తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నందుకు శుభాకాంక్షలు అని రామోజీ రావు ఆ లేఖలో పేర్కొన్నారు. మీ నాయకత్వంలో జరుగుతున్న ఈ సభలు నభూతో అన్న విధంగా విజయంవంతం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

ఆ ప్రభుత్వాలు పల్లె వేశాయి

ఆ ప్రభుత్వాలు పల్లె వేశాయి

గతంలో అనేక ప్రభుత్వాలు తెలుగు భాష పైన మమకారాన్ని పల్లె వేశాయని రామోజీరావు పేర్కొన్నారు. తెలుగు భాష పట్ల ఆత్మీయతను మీరు చేతల్లో చూపుతున్నారని, 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేసిన మీ ప్రభుత్వం నిర్ణయం హర్షణీయమన్నారు.

నాకు సందేహం లేదు

నాకు సందేహం లేదు

అంతరించిపోతున్న తెలుగు భాషకు మహర్దశ తీసుకు వచ్చేందుకు మీ నిర్ణయాలు ఓ బలమైన ముందడుగు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని రామోజీ రావు పేర్కొన్నారు. తెలంగాణలో తెలుగును పటిష్ట పరుస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మీకు అభినందనలు అన్నారు.

మరో విజ్ఞప్తి

మరో విజ్ఞప్తి

తెలుగు భాష పట్ల కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసిస్తూనే రామోజీ రావు మరో విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ నియామకాల్లో తెలుగు ప్రజ్ఞను అనివార్యం చేయాలని తాను వినమ్రంగా ప్రతిపాదిస్తున్నానని కోరారు.

English summary
Ramoji Rao wrote a letter to Telangana Chief Minister Kalvakuntala Chandrasekhar Rao. He praised CM KCR in his letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X