వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాములమ్మ వర్సెస్ జగ్గారెడ్డి .. కాంగ్రెస్ లో ఇదొక లొల్లి

|
Google Oneindia TeluguNews

తెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి యూపీఏ కూటమిలోకి మరో రెండు పార్టీలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చెయ్యటం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తమతో టీడీపీ అధినేత చంద్రబాబు టచ్‌లో ఉన్నారని చెప్పిన జగ్గారెడ్డి చంద్రబాబే కాదు వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కూడా తమతో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పటంపై విజయశాంతి మండిపడ్డారు .

కేటీఆర్ ..ప్రపంచాన్ని జయించిన నాతో పెట్టుకోకు .. శపిస్తే మసైపోతావన్న కేఏపాల్కేటీఆర్ ..ప్రపంచాన్ని జయించిన నాతో పెట్టుకోకు .. శపిస్తే మసైపోతావన్న కేఏపాల్

జగ్గా రెడ్డి వ్యాఖ్యలపై రాములమ్మ ఫైర్ .. పార్టీ శ్రేణుల్లో గందరగోళం క్రియేట్ చేస్తున్నారని మండిపాటు

జగ్గా రెడ్డి వ్యాఖ్యలపై రాములమ్మ ఫైర్ .. పార్టీ శ్రేణుల్లో గందరగోళం క్రియేట్ చేస్తున్నారని మండిపాటు

కాంగ్రెస్ పార్టీలో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన జగ్గారెడ్డి కేసీఆర్ కూడా యూపీఏ కూటమిలో కలుస్తారని చేసిన సంచలన వ్యాఖ్యలపై ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలే తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల గాంధీ భవన్ లో చేసిన వాఖ్యలను తెలంగాణా రాములమ్మ విజయశాంతి తప్పుబడుతున్నారు. జగ్గారెడ్డి చేసిన వాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తాయని, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని విజయశాంతి మండిపడుతున్నారు .అంతేకాకుండా జగ్గారెడ్డి వ్యాఖ్యలు పార్టీ నేతల్లో, కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయంటూ ఆమె జగ్గారెడ్డిని విమర్శించారు .

శత్రు పార్టీలు మద్దతు తెలుపుతాయని ప్రకటించటం కరెక్ట్ కాదన్న విజయశాంతి

శత్రు పార్టీలు మద్దతు తెలుపుతాయని ప్రకటించటం కరెక్ట్ కాదన్న విజయశాంతి

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తుందని , ఎన్డీయే సర్కార్ పై పోరాటం చేస్తుందని, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుందని, అంతే కాదు కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో పని చేస్తుందని విజయశాంతి చెప్పుకొచ్చారు. ఇలాంటి సందర్భాల్లో జగ్గారెడ్డి, కెసిఆర్ కూడా యూపీఏ కి మద్దతు తెలుపుతాడు అని మాట్లాడటం కార్యకర్తలందరిని కూడా తీవ్రమైన అసహనానికి గురి చేస్తుందని అన్నారు. యూపీఏకు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగల సత్తా ఉందని, ఒకవేళ ఆలా జరగకపోతే ఇతర పార్టీల నుండి మద్దతు ఆశిస్తామని చెప్పారు. తెలంగాణలో అడుగడుగునా కాంగ్రెస్ పార్టీని అణచివెయ్యాలని చూస్తున్న శత్రు పార్టీ కూడా తమకు మద్దతు తెలుపుతాయని మాట్లాడటం భావ్యం కాదని విజయశాంతి అన్నారు.

కాంగ్రెస్ లో జగ్గారెడ్డి వర్సెస్ రాములమ్మ .. కాంగ్రెస్ పార్టీ లో పెరుగుతున్న అంతర్గత విమర్శలు

కాంగ్రెస్ లో జగ్గారెడ్డి వర్సెస్ రాములమ్మ .. కాంగ్రెస్ పార్టీ లో పెరుగుతున్న అంతర్గత విమర్శలు

ఇక జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాములమ్మ మండిపాటుకు గురై మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీలో ముందు ముందు ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందో . ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్ధకం చెయ్యాలని టీఆర్ ఎస్ పార్టీ కంకణం కట్టుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు సొంత పార్టీ పైన చేసే విమర్శలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు పార్టీని మరింత రోడ్డున పడేస్తున్నాయి అని చెప్పటం నిర్వివాదాశం .

English summary
The Congress MLA Jaggareddy recently made a statement in the Gandhi Bhavan. Jaggareddy's statements are confusing Congress activists . the congress party leader Vijayasanthi fired. Jagga reddy said that two parties of telugu states TRS and YCP will support to UPA to form government in country . These comments created a confusion among the Congress cadre and Vijayashanti said to Jagga reddy don't talk about rival parties support to Congress .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X