వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు -రాములు నాయక్, చిన్నారెడ్డి పేర్లకు సోనియా ఆమోదం -రసవత్తరం

|
Google Oneindia TeluguNews

పేరుకు పార్టీ రహితం అయినప్పటికీ, తెలంగాణలోని వచ్చే నెలలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ తాము బలపర్చే అభ్యర్థుల పేర్లను వెల్లడించే పనిలో ఉన్నాయి. తాజాగా జాతీయ కాంగ్రెస్ పార్టీ సైతం రెండు పేర్లను ఫైనలైజ్ చేసింది.

వారానికి 4 రోజులే పనిదినాలు -మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ -కార్మిక చట్టాల్లో ప్రతిపాదనవారానికి 4 రోజులే పనిదినాలు -మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ -కార్మిక చట్టాల్లో ప్రతిపాదన

తెలంగాణలో త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తోన్న అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాములు నాయక్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థిగా జి.చిన్నారెడ్డిని ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రకటించింది. అధినేత్రి సోనియా ఆమోదంతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Ramulu Nayak and Chinnareddy finalized as TS graduates MLC Congress candidates

రెండు గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరుగనుండగా, అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక అభ్యర్థిని మాత్రమే ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరునే ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రెండో స్థానంపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ..

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కమ్యూనిస్టులు లేదా ఎంఐఎం అభ్యర్థిని బలపర్చుతోందని తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ ఆరోపించారు. కేసీఆర్ రాజకీయంగా రోజురోజుకూ వీక్ అవుతున్నారని, అందుకే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారని, జీహెచ్ఎంసీలో మద్దతుకు ప్రతిఫలంగా ఎంఐఎంకు కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ ఆఫర్ చేసినట్లు ప్రభాకర్ తెలిపారు. ఇక..

షర్మిల ఎంట్రీ -మధ్యంతర ఎన్నికలు -కేవీపీ ద్వారా కేసీఆర్ ప్లాన్ -చంద్రబాబులా కేటీఆర్: బీజేపీషర్మిల ఎంట్రీ -మధ్యంతర ఎన్నికలు -కేవీపీ ద్వారా కేసీఆర్ ప్లాన్ -చంద్రబాబులా కేటీఆర్: బీజేపీ

ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికలతో పూర్తిగా కనుమరుగైపోయిన తెలుగుదేశం పార్టీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టీడీపీ తరఫున ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీపడతారని ప్రచారం జరుగుతోంది. మిగతా పార్టీలు, ప్రముఖులైన ఇండిపెండ్ల వివరాలు ఇంకా బయటికి వెల్లడికావాల్సి ఉంది.

English summary
Congress party has finalised their candidates for the upcoming graduate MLC elections in Telangana. AICC on Tuesday announced that, Ramulu Naik as the Nalgonda-Khammam-Warangal graduate MLC candidate and G Chinnareddy as the Hyderabad-Rangareddy-Mahabubnagar MLC candidate. Interim Congress chief Sonia Gandhi has approved the candidature of the two, the statement said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X