వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంజాన్ స్పెషల్ నోరూరించే హలీం .. అందుకే ముస్లింలే కాదు అందరూ హలీం రుచికి చేస్తారు సలాం

|
Google Oneindia TeluguNews

రంజాన్ మాసం కోసం ముస్లిం లు ఎంతగా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువ ఇతర మతాల వాళ్ళు ఎదురు చూస్తారు. అలా ఎదురు చూసేలా చేసి రంజాన్ మాసాన్ని అందరి మనస్సులో ప్రత్యేక నిలబెట్టింది మాత్రం రంజాన్ స్పెషల్ హలీం . రోజంతా కఠోర దీక్ష చేసి రోజా ఉండే ముస్లింలు బలం కోసం తీసుకునే ఈ ఆహారం అన్ని మతాల వారికి ప్రీతిపాత్రమైన ఆహారం . రంజాన్ మాసంలో ఎక్కడ చూసినా హలీం ఘుమఘుమలే .. హలీం విక్రయ కేంద్రాల్లో ముస్లిమ్స్ కంటే ఎక్కువగా ఇతర మతాల వాళ్ళే దర్శనమిస్తారంటే దాని గొప్పతనం అర్ధం చేసుకోవచ్చు.

ముస్లింల పవిత్ర ఆహారం అన్ని మతాలకు ప్రీతిపాత్రమైన ఆహారం హలీం

ముస్లింల పవిత్ర ఆహారం అన్ని మతాలకు ప్రీతిపాత్రమైన ఆహారం హలీం

ఒక మతానికి చెందిన పవిత్ర ఆహారమైనప్పటికీ ప్రతి మతం వారికీ ప్రీతిపాత్రమయ్యింది హలీం . ఏ ఆహారమూ సంపాదించనంత కీర్తిని మూటగట్టుకుంది హలీం . రంజాన్ మాసంలో వంటల్లో రారాజు గా చెప్పుకునే హలీం రంజాన్ మాసం ముగుస్తుంది అంటే అన్ని మతాల వారిలో బాధను మిగులుస్తుంది. మళ్ళీ రంజాన్ ఎప్పుడు వస్తుందా అని సంవత్సరం అంతా ఎదురు చూసేలా చేస్తుంది. రంజాన్ మాసం వస్తోందంటే ముసల్మానులంతా ఉపవాసాలు చేస్తారు . ఉపవాసాలు చేసే వారు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటారు. అలాంటి అన్ని పోషకాలు ఉన్న ప్రత్యేక ఆహారమే హలీం .దుకాణాలు తెరిచీ తెరవగానే వాటి ముందు క్యూ కడుతుంటారు. లొట్టలేసుకుంటూ హలీమ్ ని లాగించేస్తారు. ఎక్కడ చూసినా అన్ని వర్గాల వారుహలీం ను ఇష్టంగా తినటం కనిపిస్తుంది.

హలీం వండటమే పెద్ద పని .. హలీం ఘుమఘుమలు ఆస్వాదించాలంటే ఇంత కష్టపడాల్సిందే

హలీం వండటమే పెద్ద పని .. హలీం ఘుమఘుమలు ఆస్వాదించాలంటే ఇంత కష్టపడాల్సిందే

హలీమ్ గొప్పదనమంతా దాన్ని వండటంలోనే ఉంటుంది. దాని తయారీ విధానమే హలీం కు ఆ గొప్పతనం, రుచి తెచ్చి పెట్టింది. హలీం తయారీకి గోధుమరవ్వను నాలుగ్గంటలు నీటిలో నానబెడతారు. తర్వాత నీటిని ఒంపేసి మాంసం, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మసాలాలతో కలిపి పన్నెండు గంటల పాటు ఉడకబెడతారు. తర్వాత దాన్ని మెత్తని పేస్ట్ లా అయ్యేవరకూ కర్రలతో కలియబెడతారు. ఇలా చేయడాన్ని గోటా కొట్టడం అంటారు. గోటా కొట్టిన తరువాతే హలీమ్ ఘుమఘుమలు మొదలవుతాయి. ఆపైన ఉల్లిపాయ ముక్కలు, బాదం పప్పు, జీడిపప్పు తదితర డ్రై ఫ్రూట్స్ ని నేతిలో వేయించి హలీంలో కలుపుతారు. తినేముందు కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం చల్లి ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లారకుండా బట్టీల్లో వేడి మీదే ఉంచుతారు. అందుకే ఎప్పుడు హలీమ్ తిన్నా వేడిగానే ఉంటుంది. ఇంత ప్రత్యేకంగా తయారు చేయబట్టే హలీమ్ అన్నింట్లోకీ ప్రత్యేకంగా నిలిచింది.

రంజాన్ మాసంలో హలీం తో ఏటా వందల కోట్ల బిజినెస్ .. అదిరిపోయే రుచితో అందరితో సలాం చేయించుకుంటున్న హలీం

రంజాన్ మాసంలో హలీం తో ఏటా వందల కోట్ల బిజినెస్ .. అదిరిపోయే రుచితో అందరితో సలాం చేయించుకుంటున్న హలీం

మటన్ తో చేసేదాన్ని హలీమ్ అనీ, చికెన్ తో చేసేదాన్ని హరీస్ అనీ అంటారు. పేరు ఏదైనా... పదార్థాలు ఏవైనా...దాని రుచి దేనికీ కాదు. ఇక ఈ సీజన్ లో హలీం రుచుల్ని అందించడమే కాదు... దుకాణందారులకు డబ్బుల వర్షం కురిపిస్తోంది. అది కూడా కోట్లలో. యేటా ఒక్క హైదరాబాద్ లోనే వంద కోట్లకు పైగా బిజినెస్ జరుగుతోందంటే దీని డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భాగ్యనగరంలో వేలల్లో హలీమ్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఆన్ లైన్ బుకింగ్ కూడా మొదలవ్వడంతో బిజినెస్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఎంతోమందికి జీవనాధారం కూడా కల్పిస్తోంది.

వాస్తవానికి వేరే దేశం నుంచి హలీమ్ హైదరాబాద్ కి వచ్చింది. కానీ ఇప్పుడు హలీమ్ కి హైదరాబాదే కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. అందరికి అత్యంత ఇష్టమైన వంటకం అయ్యింది. అందరి మనసులను గెలుచుకుని అదిరిపోయే రుచితో హలీం అన్ని మతాల వారితో సలాం చేయించుకుంటుంది.

English summary
Once the sun sets in Hyderabad during Ramazan month, it's feast for foodies every evening. Muslims break fast and gather around with their families to indulge in a feast. And for people who can't sit down with their families, due to work, eating in a restaurant or at roadside stalls is convenient. Haleem centers are one of the most popular spots for eating and hanging out. The simple yet flavorful dish is a very popular favourite among Hyderabadis and people from all religions also flock to their favourite haleemeateries to relish it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X