వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధిక్కరణ: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు రూ.1,116 జరిమానా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు రూ.1,116 జరిమానా విధించింది. కలెక్టర్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారంటూ న్యాయస్థానం జరిమానాను విధించింది. పోచారంలో రోడ్డు పైన సాఫ్టువేర్ సంస్థ గోడ నిర్మాణం పైన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దానిని కలెక్టర్ పట్టించుకోలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. సమస్యను పరిష్కరించాలని కోర్టు ఆదేశించినా కలెక్టర్ పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో కలెక్టర్‌కరు న్యాయస్థానం జరిమానా విధించింది. ఎనిమిది వారాల్లో జరిమానా కట్టాలని ఆదేశించింది.

Ranga Reddy district collector fined for Rs.1,116

ఈ విషయాన్ని ముస్సోరీ ఐఏఎస్ ట్రెయినింగ్ సెంటర్‌కు తెలియజేయాలని హైకోర్టు సూచించింది. కలెక్టర్ రికార్డులో జరిమానా విషయం పొందుపర్చాలని ఆదేశించింది.

గణేష్ నిమజ్జనం కోసం సాగర్లో ఎన్‌క్లోజర్స్

వినాయక సాగర్లో గణేష్ నిమజ్జనం అంశంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. గణేష్ నిమజ్జనం కోసం ఎన్ క్లోజర్స్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. నిమజ్జనం తర్వాత సాగర్‌ను శుభ్రం చేయాలని పేర్కొంది. వినాయక విగ్రహాల ఎత్తును పరిశీలించాలని ఆదేశించింది. ఈ నెల 27న నివేదిక ఇవ్వాలని జిహెచ్ఎంసి ఆదేశాలు జారీ చేసింది.

English summary
Ranga Reddy district collector fined for Rs.1,116.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X