వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగారెడ్డి అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్ : ఉదయ్ స్థానంలో ప్రతాప్‌కు టికెట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల పోరు కోసం అధికార, విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులు ప్రకటించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి అభ్యర్థిని మారుస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఎందుకు మారుస్తున్నామనే అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెల్లడించలేదు.

తెరపైకి ప్రతాప్ ...
రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా తొలుత ఉదయ్ మోహన్ రెడ్డి పేరును ప్రకటించింది. అయితే అతని స్థానంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మురి ప్రతాప్ రెడ్డిని బరిలోకి దింపుతున్నట్టు స్పష్టంచేసింది. అతనికి బీఫామ్ కూడా ఇవ్వడంతో నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతాప్ రెడ్డి 2004లో టీఆర్ఎస్ నుంచి చేర్యాల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ పార్టీలో క్రియాశీలక నేతగా వ్యవహరించారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని వీడారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయనను స్థానిక సంస్థల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. రంగారెడ్డి జిల్లాలో అతనికి పోటీగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. మహేందర్ రెడ్డిని ఎదుర్కొవడం ఉదయ్‌తో కాదని భావించి .. ప్రతాప్ పేరును తెరపైకి తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

rangareddy mlc congress candidate chnage

నల్గొండ, వరంగల్‌లో పోటీ ...
ఇటు నల్గొండ స్థానిక సంస్థ నియోజకవర్గంలో తేరా చిన్నపరెడ్డి పోటీలో ఉండగా ... ఆయనను ఢీకొట్టేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ సిద్దంగా ఉన్నారు. ఇక్కడ పోరు నువ్వా నేనా అని సాగనుంది. వరంగల్ స్థానిక సంస్ల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ ఆయనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరకాల నియోజకవర్గ నేత ఇనుగులు వెంకట్రామిరెడ్డి గట్టి టఫ్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మూడు స్థానాల్లో అధికార, విపక్షాలు రెడ్డి సామాజికివర్గానికి చెందిన నేతలు టికెట్లు ఇవ్వడం విశేషం. దీంతో ఏ పార్టీ గెలిచినా పెద్దల సభ మండలిలో రెడ్డిలు అడుగుపెట్టబోతున్నారు. దీంతో వారి సామాజికవర్గం ప్రతినిధుల సంఖ్య మండలిలో మరింత పెరుగుతుంది.

English summary
The parties already announced the candidates. However, Congress has announced that Ranga Reddy will change the candidate. The Telangana Congress party did not reveal why it was changing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X