హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

143 మంది అత్యాచారం... ఇన్నేళ్లు ఎందుకు నోరు విప్పలేదు... పోలీసులకు సవాల్‌గా సంచలన కేసు...

|
Google Oneindia TeluguNews

ఒకరు కాదు,ఇద్దరు కాదు, 143 మంది... 11 ఏళ్లుగా అత్యాచారం... ఇటీవల హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. బాధితురాలు చెప్తున్న విషయాల్లో నిజానిజాలేంటో అంతుచిక్కక పోలీసులు తల పట్టుకున్నారు. సీఐడీ లేదా సీసీఎస్‌కి అప్పగిస్తేనే కేసులో పురోగతి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని విచారించినప్పటికీ... తమకేమీ తెలియదని,ఇదంతా కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు బాధితురాలు మాత్రం తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇన్నేళ్లు ఎందుకు మౌనంగా...

ఇన్నేళ్లు ఎందుకు మౌనంగా...

బాధితురాలు ఇన్నేళ్లు మౌనంగా ఎందుకు ఉందనేది పోలీసులను తొలుస్తున్న ప్రశ్న. అయితే నిజం బయటకు పొక్కితే చంపేస్తామన్న బెదిరింపుల కారణంగానే ఇన్నాళ్లు వారికి తలొగ్గుతూ వచ్చానని బాధితురాలు చెబుతోంది. వెనకా,ముందు తనకు ఎవరూ లేని కారణంగా తననేమైనా చేయగలమని బెదిరించేవారని పోలీసులతో చెప్పింది. వేధింపులు భరించలేక ఆత్మహత్య కూడా చేసుకుందామని భావించానని... తన మరణ వాంగ్మూలం కూడా రికార్డ్ చేశానని పేర్కొంది.

ఆధారాలున్నాయా..?

ఆధారాలున్నాయా..?

అత్యాచార ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు మాత్రం తన వద్ద ఏమీ లేవని బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. అయితే నిందితులు తనను తీసుకెళ్లిన హోటల్స్,ఇతరత్రా చిరునామాలు చెబుతానని తెలిపింది. అయితే ఆమె చెప్పిన వివరాలు ఐదేళ్లు,తొమ్మిదేళ్ల క్రితంవి కావడంతో... ఇప్పుడు అక్కడికి వెళ్లి ఆధారాలు సంపాదించడం అసాధ్యమని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తున్నారు.

కుట్ర.. బ్లాక్‌మెయిల్ ఆరోపణలు...

కుట్ర.. బ్లాక్‌మెయిల్ ఆరోపణలు...

ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కొంతమందిని విచారించారు. బాధితురాలు చేస్తున్న ఆరోపణలను వారు తిప్పి కొట్టారు. అంతేకాదు,బాధితురాలి వెనుక ఇంకెవరో ఉండి నడిపిస్తున్నారని... తమను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని వారు ఆరోపించారు. అసలు ఆ యువతిని తామెప్పుడూ చూడలేదని పోలీసులతో చెప్పారు. ఇదంతా కేవలం బ్లాక్ మెయిల్ అని,నిజాలను మీరే బయటపెట్టాలని పోలీసులను కోరుతున్నారు.

సీఐడీకి అప్పగిస్తారా...

సీఐడీకి అప్పగిస్తారా...

కేసును లోతుగా విచారిస్తేనే పురోగతి సాధ్యపడే అవకాశం ఉండటంతో సీఐడీకి అప్పగించాలా లేక సీసీఎస్‌కు బదిలీ చేయాలా అని పోలీసులు ఆలోచిస్తున్నారు. అటు న్యాయ నిపుణులను కూడా సంప్రదించి కేసులో ఎలా ముందుకెళ్లాలో సలహాలు సూచనలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న ఈ కేసులో మున్ముందు ఎలాంటి నిజాలు బయటపడుతాయో వేచి చూడాలి.సీఐడీకి అప్పగిస్తారా...

కేసును లోతుగా విచారిస్తేనే పురోగతి సాధ్యపడే అవకాశం ఉండటంతో సీఐడీకి అప్పగించాలా లేక సీసీఎస్‌కు బదిలీ చేయాలా అని పోలీసులు ఆలోచిస్తున్నారు. అటు న్యాయ నిపుణులను కూడా సంప్రదించి కేసులో ఎలా ముందుకెళ్లాలో సలహాలు సూచనలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న ఈ కేసులో మున్ముందు ఎలాంటి నిజాలు బయటపడుతాయో వేచి చూడాలి.

Recommended Video

హైదరబాద్ లో బాలికను రేప్ చేసిన రౌడీ షీటర్
అసలేం జరిగింది....

అసలేం జరిగింది....

బాధితురాలు ఇటీవల పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. 11 ఏళ్లుగా పలువురు సినీ,రాజకీయ,విద్యార్థి సంఘాల నాయకులు తనపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నగ్న చిత్రాలు,వీడియోలు తీశారని చెప్పారు. విడాకుల తర్వాత నల్గొండలోని పుట్టింటిలో ఉంటున్న సమయంలో కొంతమంది విద్యార్థి సంఘం నాయకులతో పరిచయం ఏర్పడిందని... అప్పటినుంచి తనపై తన జీవితం ఇలా మారిపోయిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని,తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తోంది.

English summary
In a sensational case, a 25-year-old woman has lodged a complaint with the Hyderabad police, alleging that she was sexually assaulted by 143 people since 2010.Now,its become very difficult for police to deal the case,they are thinking to transfer it for CID or CCS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X