• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్కుల్లో రొమాన్స్ చేసే జంటలే వాడి టార్గెట్..!! లవర్‌ను చంపి.. ప్రేయసిపై ...

|

మధిర : ఒంటరిగా ఉన్న ప్రేమికులే లక్ష్యం. జనం లేకుండా దూరంగా ఉన్న జంటలే అతని టార్గెట్. అవును రేపిస్ట్, నరహంతకుడు రాజు అలియాస్ అంకమారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇతని నేరచరిత్ర చూసి మధిర పోలీసులే నోరెళ్లబెట్టారు. మానవరూపంలో ఉన్న మృగమని బాధితులు నిట్టూరుస్తున్నారు.

నరరూప రాక్షసుడు ..

నరరూప రాక్షసుడు ..

పక్క ఫోటోలో అమాయకంగా కనిపిస్తోన్న వ్యక్తి పేరు రాజు అలియాస్ అంకమరావు. చూడటానికి అమాయకంగా ఉన్నాడు కానీ .. చేసే పనులు మాత్రం ఒళ్లు గగుర్పొడుస్తాయి. ఒంటరిగా ఉన్న జంటలే లక్ష్యంగా దాడులు చేస్తాడు. ఇప్పటివరకు ఇతనిపై చాలా కేసులు ఉన్నాయి. అంకమరావును మధిర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

 మాటేసి .. మట్టుబెట్టి ..

మాటేసి .. మట్టుబెట్టి ..

ఏకాంత ప్రదేశంలో జంట కనిపిస్తే చాలు .. పురుషుడిని కాస్త కనికరంగా లేకుండా దాడిచేసేవాడు. వారిని చంపేసి .. మహిళలపై లైంగికదాడి చేశాడు. ఇలా ఏపీలో చాలా కేసులు ఇతనిపై నమోదయ్యాయి. ఇతనిని గతంలోనే ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారి కళ్లు గప్పి ఎలాగోలా పారిపోయాడు. మధిర మండలం తొర్లపాడు సమీపంలోని సుబాబుల్ తోటలో ఓ వ్యక్తిని హత్యచేసి రైల్వే ట్రాక్‌పై పడేసి వెళ్లిపోయాడు. దీనిపై రైల్వే పోలీసలు కేసు కూడా పెట్టారు. మరోవైపు ఇటీవల ఏపీలోని నూజివీడులో జరిగిన లైంగికదాడి కేసులో కూడా దొరికినట్టే దొరికి తప్పించుకొని పోయాడు. నెల్లూరు జిల్లా జైలులో ఉన్న రాజును పీవోటీ ద్వారా మధిర జైలులో హాజరుపరిచి తొర్లపాడు సమీపంలో జరిగిన హత్య కేసుపై విచారించేందుకు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విపన్నపేట, చాట్రాయి, ఆగిరిపల్లిలో రాజుపై ఇదివరకు లైంగికదాడి కేసులు కూడా ఉన్నాయి. నూజివీడు శివారు శిలువగట్టులో జరిగిన లైంగికదాడి కేసులో రాజుపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ క్రమం జరుగుతుంది. ఇతనికి కూడా వరంగల్ ప్రవీణ్ లాగా ఉరిశిక్ష విధించాలని ప్రజాసంఘాల నేతలు కోరుతున్నారు.

ప్రైవసీ కోసం వెళ్తే ..

ప్రైవసీ కోసం వెళ్తే ..

సాధారణంగా జంటలు తమ ప్రైవసీ కోసం పార్కులు, ఏకాంత ప్రదేశానికి వెళ్తుంటారు. మనసు విప్పి మాట్లాడుకుందామని ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. కానీ వారి ప్రైవసీ సంగతి దేవుడెరుగు ఈ రాజురూప రాక్షసుడు వారి పాలిట యముడయ్యాడు. జంటలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడంతో వారు నిర్ఘాంతపోతున్నారు. మాట్లాడుకోవడం కాదు కదా .. ప్రాణాలను అరచేతిలి పెట్టుకుని పారిపోతున్నారు. దాదాపు రాజు కబంధ హస్తాల నుంచి ఎవరూ తప్పించుకోలేరని పోలీసులు చెప్తున్నారు. దీనికితోడు కొందరు వివాహేతర సంబంధం పెట్టుకున్న వారు కూడా ఏకంతం కోసం పార్కులను ఆశ్రయిస్తున్నారు. ఇంట్లో మాట్లాడుకోలేమని అక్కడికి వస్తుంటారు. కానీ అక్కడే ఓ మృగాడు ఉన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఇంతలో రాజు .. మాటేసి మట్టుబెట్టి ... లైంగికదాడి చేస్తూ తన పని ఏంచక్కా పూర్తిచేస్తున్నాడు. ఏపీలో వెలుగుచూసిన రాజు అరాచకాలతో ప్రేమజంటలు పార్కులు .. ఏకాంత ప్రదేశాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇక నుంచి పబ్లిక్‌గా పది మందిలో మాట, ముచ్చట ఉంటుందని .. అంతే తప్ప ఏకాంతం కోసం వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకొమ్మని కొందరు జంటలు చెప్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపట్టింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
raju alias Ankamarao. He was innocent to see but .. the things that are done are creepy. Lonely couples do targeted attacks. So far there have been many cases against him. Ankamarao was reliably reported to have been taken into custody by Mathira police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more