• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Rapist Raju : ఎల్బీనగర్‌లో ఆటోను దొంగిలించేందుకు యత్నించిన రేపిస్ట్ రాజు...

|

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు రాజుకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగుచూసింది. హత్యాచారం తర్వాత తప్పించుకుని పారిపోయిన రాజు ఎల్బీ నగర్‌ ప్రాంతంలో ఓ ఆటోను దొంగిలించేందుకు యత్నించాడు.

ఎల్బీనగర్ ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో రోడ్డు పక్కన ఓ ఆటో నిలిపి ఉండటాన్ని రాజు గమనించాడు. అందులో ఎవరూ లేకపోవడంతో లోపలికి ఎక్కి స్టార్ట్ చేసే ప్రయత్నం చేశాడు.ఇంతలో ఆ ఆటోడ్రైవర్ వచ్చి... తన ఆటోలో ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్‌పై రాజు దాడికి కూడా యత్నించినట్లు చెబుతున్నారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు ఇరువురికి సర్ది చెప్పి పంపించడంతో గొడవ సద్దుమణిగింది.

 rapist raju tried to steal an auto in lb nagar area in hyderabad

అక్కడినుంచి ఎల్బీనగర్ చౌరస్తాకు వెళ్లిన రాజు... అక్కడ ఓ బస్సులో ఎక్కి ఉప్పల్ వైపు వెళ్లినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత రాజు ఎక్కడికి వెళ్లాడనేది ఎవరికీ తెలియదు. గురువారం(సెప్టెంబర్ 16) ఉదయం స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నష్కల్ స్టేషన్‌ వద్ద విగతజీవిగా కనిపించాడు. మొదట రైల్వే కీమాన్లు అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అతన్ని రాజుగా పోలీసులు నిర్దారించారు.

రాజు కోసం భారీ ఎత్తున పోలీస్ బృందాలు గాలిస్తున్న సమయంలో ఎక్కడా సీసీ కెమెరాలకు చిక్కకుండా అతను స్టేషన్ ఘన్‌పూర్ వరకు ఎలా వెళ్లాడన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో స్టేషన్ ఘన్‌పూర్ చేరుకుని... అక్కడి నుంచి రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్లి ఉంటాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాజు మృతిపై తాజాగా హైకోర్టులో పిల్ దాఖలైంది.నిందితుడు రాజుది కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పౌర హక్కుల సంఘం అధ్యక్షులు కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.దీనిపై మధ్యాహ్నం విచారణ జరపనుంది.

మరోవైపు రాజు తల్లి,అతని భార్య మౌనిక పోలీసులే అతన్ని చంపేశారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.తమ ఇల్లు ధ్వంసం చేశారని... ఉన్న ఒక్క దిక్కు రాజును కోల్పోయామని... తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.రాజు ఆచూకీ దొరక్కపోవడంతో తమను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బుధవారం రాత్రి వదిలేశారని వారు తెలిపారు. అప్పటికే రాజు దొరికాడని పోలీసులు మాట్లాడుకుంటుండగా తాము విన్నామని చెబుతున్నారు.

చిన్నారిపై హత్యాచారం :

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి గత గురువారం (సెప్టెంబర్ 9) హత్యాచారానికి గురైంది.స్థానికంగా ఉండే పల్లంకొండ రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయినా ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో జులాయిగా తిరిగే రాజుపై అనుమానం వచ్చింది. నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ చిరు నవ్వులతో ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ ఓ దుర్మార్గుడి దాష్టికానికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Raju,The accused in the murder of a six-year-old girl in Saidabad Singareni Colony in Hyderabad,who escaped after the assassination, tried to steal an auto in the Lb Nagar area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X