కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దోపిడీకి గురవుతున్న అటవీ సంపద: పట్టుకున్న రామగుండం అటవీశాఖ

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను రామగుండం అటవీ శాఖ అధికారులు శనివారం పట్టుకున్నారు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను రామగుండం అటవీ శాఖ అధికారులు శనివారం పట్టుకున్నారు. అటవీ సెక్షన్‌ అధికారి రహ్మతుల్లా హుస్సేన్‌, బీట్‌ అధికారి శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం నాగ్‌పూర్‌ నుంచి డీసీఎం వ్యాన్‌ టేకు కలపతో బయలుదేరింది.

Rare wood smuggling

కలప కనిపించకుండా పైన కోడిగుడ్లు నిల్వ చేసే కేస్‌లు ఉంచారు. వ్యాన్‌లో ఉన్న కేవలం 38 చదరపు అడుగుల టేకు కలపకు మాత్రమే అనుమతి బిల్లు ఉంది. అదనంగా రూ.లక్షకుపైగా టేకు కలపను కనిపించకుండా ఉంచి గోదావరిఖని ప్రాంతంలో దాచే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నారు.

Rare wood smuggling

కలపను, వాహనాన్ని స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. డీసీఎం వ్యాన్‌ వెంట ఉన్న కస్యప్‌, విక్కిల వద్ద మరికొన్ని నకిలీ పర్మిట్‌ బిల్లులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

English summary
Rare Wood smuggling
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X