వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతిని కదిలించింది: ఇంటర్ విద్యార్ధుల మృతిపై నివేదిక ఇవ్వండి: హోం శాఖ..సీఎస్ కు ఆదేశం..!!

|
Google Oneindia TeluguNews

కొద్ది రోజులు క్రితం తెలంగాణలో చోటు చేసుకున్న ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య ఘటనల పైన రాష్ట్రపతి భవన్‌ స్పందించింది. తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్లక్ష్యం కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలపై తక్షణం నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి భవన్‌ కోరింది. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర హోం శాఖను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇంటర్‌ బోర్డు వైఖరిని నిరసిస్తూ, విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని బృందం గత నెల 1న రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం అందజేసింది. దీనిపై రాష్ట్రపతి భవన్‌ స్పందించింది. తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

<strong>బీజేపీలోకి విజయశాంతి..మాజీ డిప్యూటీ సీఎం : మాజీ ఎంపీలు..ఎమ్మెల్యేలు సైతం: 18న ముహూర్తం..!! </strong>బీజేపీలోకి విజయశాంతి..మాజీ డిప్యూటీ సీఎం : మాజీ ఎంపీలు..ఎమ్మెల్యేలు సైతం: 18న ముహూర్తం..!!

స్పందించిన రాష్ట్రపతి భవన్‌..
తెలంగాణలో ఇంటర్ బోర్డు కారణంగా విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న ఘటన పైన రాష్ట్రపతి భవన్‌ నివేదిక కోరింది. తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్లక్ష్యం కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలపై తక్షణం నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి భవన్‌ ఆదేశించింది. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర హోం శాఖను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలను ఆదేశించింది. ఇంటర్ బోర్డు అధికారుల వైఫల్యం కారణంగా మెరిట్‌ విద్యార్థులు కూడా ఫెయిలయ్యారు. వారిలో కొందరికి సున్నా మార్కులు కూడా వచ్చాయి. ఫలితాలతో మనస్తాపానికి గురై వేర్వేరు ప్రాంతాల్లో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంటర్‌ బోర్డుకు సాంకేతిక సహకారం అందించిన గ్లోబరీనా సంస్థదే తప్పంటూ అప్పట్లో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే, విచారణకు ప్రభుత్వం కమిటీని కూడా వేసింది. ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు జరిగాయని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. ఇక, ఇదే విషయం పైన రాష్ట్రపతి భవన్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని బృందం ఇచ్చిన ఫిర్యాదు పైన రాష్ట్రపతి భవన్‌ స్పందించింది.

Rashtrapati Bhavan order Central Home Ministry in Telangana CS to give report on Inter students suicide.

రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి...
ఇంటర్ ఫలితాల వెల్లడితో వేల మంది విద్యార్థుల విషయంలో వివిధ స్థాయుల్లో తప్పులు జరిగాయని నాడు ప్రభుత్వం నియమించిన కమిటీ స్పష్టం చేసింది. ఇందుకు ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా సంస్థ.. రెండింటిదీ తప్పు ఉందని తేల్చి చెప్పింది. సాంకేతిక కారణాల వల్లే తప్పులు జరిగాయని, వీటిని బోర్డు, గ్లోబరీనా సకాలంలో గుర్తించలేకపోయాయని ఆక్షేపించింది. ఈ నేపథ్యంలోనే, ఇంటర్‌ బోర్డు వైఖరిని నిరసిస్తూ, విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని బృందం గత నెల 1న రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రం అందజేసింది. వరుసగా జరుగుతున్న విషాద ఘటనలను మీ దృష్టికి తీసుకురావడం తప్ప మరో గత్యంతరం లేకపోయిందని అందులో పేర్కొంది. తీవ్ర మానసిక వేదన కలిగించడం ద్వారా ప్రభుత్వ సంస్థలే అమాయక విద్యార్థుల జీవించే హక్కును హరించి వేశాయని, అయినా, ఏమీ జరగలేదంటూ ప్రభుత్వం తేల్చేసిందని వివరించారు. రాష్ట్రపతి జోక్యాన్ని కోరడం తప్ప తమకు మరో మార్గాంతరం లేకపోయిందని పేర్కొంది. విద్యార్థుల ఆత్మహత్యలు, అందుకు దారి తీసిన పరిస్థితులపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరాలని, ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిగితేనే నిజానిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నామని, ఈ మేరకు గవర్నర్‌ను ఆదేశించాలని కోరింది. దీని పైన స్పందించిన రాష్ట్రపతి భవన్‌ తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
English summary
Rashtrapthi Bhavan orderd Central Home Ministry adn Telangana CS to give report on Inter students suicide. At the time of inter results announcement many students committed suicide due to Board mistakes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X