వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండస్ట్రియల్ పాలసీ భేష్, ఎక్కడా చూడలేదు: కెటిఆర్‌తో రతన్ టాటా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం(టిఎస్ ఐపాస్)పై భారత పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా ప్రశంసలు వర్షం కురిపించారు.

బుధవారం మధ్యాహ్నం తెలంగాణ ఐటిశాఖ మంత్రి కె తారక రామారావు ఆయనను కలిశారు. ఆయనకు మంత్రి కెటిఆర్ తెలంగాణ పారిశ్రామిక విధానంపై వివరించారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను తెలిపారు.

ఈ సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ.. తెలంగాణ పారిశ్రామిక విధానం గొప్పగా ఉందని అన్నారు. ఏళ్లుగా పారిశ్రామికవేత్తగా ఉన్న తాను తెలంగాణ పారిశ్రామిక విధానం లాంటి విధానాన్ని ఎక్కడా చూడలేదని ఆయన పేర్కొన్నారు.

కాగా, వచ్చే నెలలో తెలంగాణ్ హబ్ ప్రారంభోత్సవానికి రతన్ టాటాను కెటిఆర్ ఆహ్వానించారు. తెలంగాణ హబ్‌ నిర్వహణకు సంబంధించి రతన్ టాటా మంత్రి కెటిఆర్‌కు పలు సూచనలు చేశారు.

సర్కారు బడుల్లోనూ‘స్మార్ట్‌క్లాసులు

పాఠ్య పుస్తకాలతో సంబంధం లేకుండా.. దృశ్యోపకరాల అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి చదువుకునే రోజులు వచ్చాయి. ఇవే స్మార్ట్ క్లాసెస్. ఆకర్షణీమైన బోధన పేరిట ఇన్నాళ్లుగా కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమైన ఈ విధానం తాజాగా, ప్రభుత్వ స్కూళ్లలోనూ ప్రవేశించాయి.

Ratan Tata praises TS IPASS

నూతన పోకడలను ఆకలింపు చేసుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌కు ధీటుగా ఫలితాలు సాధిస్తామన్న భరోసాను కల్పిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ జిల్లాలోని 12 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్మార్ట్ క్లాసెస్ ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నారు.

పైలెట్ ప్రాజెక్ట్ క్రింద సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ అధికారులు వీటిని ఎంపిక చేశారు. జిల్లాలోని ఒక్కో మండలం నుంచి ఒక్కో పాఠశాలను ఎంపిక చేశారు. ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత మిగతా పాఠశాలల్లో ఇదే తరహా బోధనను కొనసాగించనున్నారు.

English summary
Tata Group chairman Emeritus Ratan Tata on Wednesday praised TS IPASS, when Minister KT Rama Rao met him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X