హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణాలో రేషన్ పంపిణీ నిలిపివేత .. తలనొప్పిగా పంపిణీ.. నేడు రానున్న క్లారిటీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ 700 కేసులు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా షట్ డౌన్ రాష్ట్రాలను షట్ డౌన్ చేసి ప్రజలకు కావలసిన మౌలిక అవసరాలను తీర్చే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో నిరుపేదలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం ఉచిత రేషన్ ఇస్తామని, అలాగే 1500 రూపాయలు నగదు ఇస్తామని ప్రకటించింది. కానీ తాజాగా రేషన్ పంపిణీ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

సోషల్ మీడియా ఎఫెక్ట్ .. కరోనా వచ్చిందన్న భయం .. లేఖ రాసి మరీ ఉరేసుకున్న వ్యక్తిసోషల్ మీడియా ఎఫెక్ట్ .. కరోనా వచ్చిందన్న భయం .. లేఖ రాసి మరీ ఉరేసుకున్న వ్యక్తి

లాక్ డౌన్ తో ఉచిత రేషన్ .. జనాల దెబ్బకు పంపిణీ నిలిపివేత

లాక్ డౌన్ తో ఉచిత రేషన్ .. జనాల దెబ్బకు పంపిణీ నిలిపివేత

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ సందర్భంగా ఇళ్లకే పరిమితం కావాలని సూచించిన సర్కార్ ప్రజలకు కావలసిన బియ్యం , పప్పులు అందిస్తామని ఉచిత రేషన్ ఇస్తామని ప్రకటించింది . మొత్తంగా 2.80 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.అయితే రేషన్ బియ్యం సరఫరా ఇవ్వటం ప్రారంభించిన వారు ఒక్కసారిగా రేషన్ కోసం ప్రజలు గుమి కూడుతున్న నేపధ్యంలో రేషన్ సరఫరా కూడా నిలిచిపోయింది.

నిన్నటి నుండి ప్రారంభమైన పంపిణీ ... ఎగబడుతున్న జనాలు

నిన్నటి నుండి ప్రారంభమైన పంపిణీ ... ఎగబడుతున్న జనాలు

ఇక నిన్నటి నుండి హైదరాబాద్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ మొదలవగా, ప్రజల తాకిడి తట్టుకోలేక , ప్రత్యామ్నాయం ఆలోచించాలని భావించిన సర్కార్ రేషన్ ఇవ్వటాన్ని మధ్యాహ్నాం 3 గంటలకే రాష్ట్ర పౌరసరఫరాల నుంచి వచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు నిలిపివేసింది . ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సేఫ్టీ గురించి ఎంత చెప్పినా మళ్ళీ మొదటికే వస్తుంది వ్యవహారం .

తలనొప్పిగా మారిన లబ్దిదారుల కంట్రోలింగ్... పంపిణీ నిలిపివేసిన సర్కార్

తలనొప్పిగా మారిన లబ్దిదారుల కంట్రోలింగ్... పంపిణీ నిలిపివేసిన సర్కార్

ఉచిత బియ్యం కావడంతో కొన్ని చోట్ల బియ్యం కోసం ప్రజలు ఎగబడ్డారు. 20 మందికి మించి రావద్దని విన్నవించినా వందల సంఖ్యలో ఎగబడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వైరస్ మరింత ప్రబలే అవకాశం ఉన్నందున మధ్యలోనే బియ్యం పంపిణీని ఆపివేసినట్లు తెలుస్తుంది . ప్రభుత్వ ఆదేశాలతో బియ్యం పంపిణీ నిలిపివేసిన డీలర్లు రేషన్ పంపిణీ నిలిపివేతకు సరైన కారణాలు తెలుపలేదు . దీంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

 పంపిణీపై నేడు నిర్ణయం ... జనాలు గుమి కూడకుండా ఎలా ఇవ్వాలో ప్లాన్

పంపిణీపై నేడు నిర్ణయం ... జనాలు గుమి కూడకుండా ఎలా ఇవ్వాలో ప్లాన్

అయితే ఈ పంపిణీలో లబ్ధిదారులు ఒకే దగ్గర గుమికూడకుండా ఉండేలా వార్డుల వారీగా, టోకెన్ పద్దతిన పంపిణీ మొదలు పెట్టారు. మరో పక్క ఈ-పాస్, బయోమెట్రిక్ విధానం రద్దు చేసి కీ రిజిష్టర్ ఆధారంగా పంపిణీకి అవకాశం ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం సైతం విన్నవించింది. ఇక ఇదే ఇప్పుడున్న పరిస్థితిలో అనివార్యం అని పేర్కొన్నారు . అలా అయితేనే కరోనా కట్టడికి సాధ్యమవుతుందని కూడా వారు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నేడు బియ్యం పంపిణీకి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది . ఇక ప్రభుత్వం ఎందుకు సరఫరా నిలిపివేసిందో తెలీక లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారు. రేషన్ డీలర్లను ఇబ్బంది పెడుతున్నారు.

English summary
Telangana goernment suggested that the lock-down in Telangana state should be limited to homelessness, and that the people would be given free ration of rice and pulses. The Civil Supplies Department has taken steps to distribute 2.80 crore rice to 12kg of beneficiaries in total. However, the ration supply has come to a standstill in the wake of a rallying crowd of people who have started to supply ration rice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X