వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ9 రవిప్రకాశ్ బెయిల్‌పై వాడీ వేడీగా వాదనలు .. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. తీర్పును రెండువారాలపాటు వాయిదావేసింది. టీవీ9 లో ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

తప్పుడు కేసులు ...?
రవిప్రకాశ్‌పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది అహ్లువాలియా వాదనలు వినిపించారు. శివాజీ, రవిప్రకాశ్ మధ్య జరిగిన షేర్ల లావాదేవీలు నిజమేనని పేర్కొన్నారు. డైరెక్టర్ల నియమాకానికి సంబంధించి రవిప్రకాశ్ ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు ప్రభుత్వ తరఫు న్యాయవాది తన వాదనలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. టీవీ9 కొనుగోలు కోసం బ్లాక్ మనీ ఉపయోగించారని తెలిపారు. రూ.500 కోట్ల బ్యాంకు ద్వారా చెల్లించాలరని గుర్తుచేశారు. ముందస్తు బెయిల్ అంశంపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రెండువారాల పాటు వాయిదావేసింది.

ravi prakash bail plea arguements complete

ఇదీ నేపథ్యం ...
ఫోర్జరీ, నిధుల మళ్లింపుకు సంబంధించి రవిప్రకాశ్‌పై అలంద మీడియా ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఎస్ పోలీసులు ఐటీ యాక్ట్‌ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రవిప్రకాశ్, టీవీ 9 డైరెక్టర్ మూర్తి, రవి స్నేహితుడు శివాజీకి నోటీసులు జారీచేశారు. అయితే మూర్తి మాత్రం సీసీఎస్ పోలీసులు .. పిలిచినా వెంటనే విచారణకు హాజరయ్యారు. శివాజీ ఆజ్క్షాతంలోకి వెళ్లిపోయారు.

రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించారు. రెండుసార్లు హైకోర్టు తలుపుతట్టినా ప్రయోజనం లేకపోయింది. బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసంన అంగీకరించకపోవడంతో .. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం .. పిటిషన్ ఇష్యూను హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. దీంతో మరోసారి హైకోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదని భావించి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. తర్వాత మరోసారి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రవిప్రకాశ్.

English summary
Former TV9 CEO Raviprakash ended his bail plea in the High Court on Tuesday. The hearing of the arguments of both parties adjourned the judgment for two weeks. Ravi Prakash has approached the High Court seeking bail in the case of forgery and diversion of funds on TV9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X