వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజ్ఞాతం వీడిన రవిప్రకాశ్ : పోలీసు విచారణకు హాజరు ..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సైబర్ క్రైం పోలీసుల విచారణకు హాజరయ్యారు. టీవీ 9 సంస్థలో ఫోర్జరీ, డేటా చోరీ ఆరోపణలను రవిప్రకాశ్ ఎదుర్కొన్నారు. రవిప్రకాశ్‌పై అలంద మీడియా సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవిప్రకాశ్ ఆజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇప్పించాలని హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లెక్కినా ఊరట కలుగకపోవడంతో ... విచారణకు హాజరావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విచారణ ..

విచారణ ..

ఫోర్జరీ, డేటా చోరీ అంశంపై సీసీఎస్ పోలీసులు రవిప్రకాశ్‌ను విచారిస్తున్నారు. అలంద మీడియా సంస్థ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎంక్వైరీ కొనసాగనుంది. అయితే అరెస్ట్ చేయాలంటే తనకు 48 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని రవిప్రకాశ్ తరఫు న్యాయవాది చెప్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీచేసిన నేపథ్యంలో .. విచారిస్తారా ? లేదంటే అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.

ఇవీ కేసులు ...

ఇవీ కేసులు ...

రవిప్రకాశ్‌పై అలంద మీడియా ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు ఐటీ యాక్ట్‌ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రవిప్రకాశ్, టీవీ 9 డైరెక్టర్ మూర్తి, రవి స్నేహితుడు శివాజీకి నోటీసులు జారీచేశారు. అయితే మూర్తి మాత్రం సీసీఎస్ పోలీసులు .. పిలిచినా వెంటనే విచారణకు హాజరయ్యారు. శివాజీ ఆజ్క్షాతంలోకి వెళ్లిపోయారు. రవిప్రకాశ్ కూడా మకాం మార్చి .. ముందస్తు బెయిల్ కోసం విఫలయత్నం చేశారు. హైకోర్టును ఆశ్రయించారు. రెండుసార్లు హైకోర్టు తలుపుతట్టినా ప్రయోజనం లేకపోయింది. బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసంన అంగీకరించకపోవడంతో .. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం .. పిటిషన్ ఇష్యూను హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. దీంతో మరోసారి హైకోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదని భావించిన రవిప్రకాశ్ .. ఇవాళ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.

నోటీసులకు స్పందించిన రవి ...

నోటీసులకు స్పందించిన రవి ...

రవిప్రకాశ్‌పై సీసీఎస్ పోలీసులు పలుమార్లు నోటీసులు జారీచేశారు. రెండుసార్లు సీఆర్‌పీసీ సెక్షన్ల 160, ఒకసారి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించకపోవడంతో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీచేశారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాల వద్ద అలర్ట్ ప్రకటించారు. దీంతో రవిప్రకాశ్ కోర్టు మెట్లెక్కారు. అప్పటికీ విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు కేవియట్ పిటిషన్ కూడా వేశారు. తనకు కోర్టులో ఊరట కలుగడం లేదని భావించిన రవిప్రకాశ్ .. చివరికి సీసీఎస్ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు.

English summary
TV9 Former CEO Ravi Prakash appeared in the cyber crime police for investigation. Ravi Prakash faced forgery and data charges in TV9. Ravi Prakash was informed that Ravi Prakash's complaint was lodged by the All Cases CCS Police. The high court and the Supreme Court have not been satisfied to file an earlier bail in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X