వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రవి ప్రకాష్ కు ముందస్తు బెయిల్‌ మంజూరు..! కొడుకు చదువుకోసం అమెరికా వెళ్తానన్న శివాజీ..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సస్పెన్స్ థ్రిల్లర్ ఉదంతాన్ని తలపించిన రవిప్రకాష్ ఎపిసోడ్ కాస్త సుఖాంతం అయ్యింది. టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు కోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ను శుక్రవారం నాడు హైకోర్టు మంజూరు చేసింది. వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని రవిప్రకాష్‌ను హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని రవిప్రకాష్‌ను హెచ్చరించింది.

రవిప్రకాష్‌పై అలంద మీడియా ఫిర్యాదు చేసింన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు రవిప్రకాష్‌పై కేసులు నమోదయ్యాయి. తనపై నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్‌లపై రవిప్రకాష్ ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.తనపై నమోదైన కేసుల విషయమై గత మాసంలో ఆయనను బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.

Recommended Video

హైకోర్టు లో శివాజీ క్యాష్ పిటిషన్
Ravi Prakash granted bail..!Shivaji goes to America to study for his son..!!

విచారణకు రాలేనని, పోలీసులకు హీరో శివాజీ ఈ మెయిల్‌ సందేశం పంపారు. టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ నుంచి షేర్ల కొనుగోలుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన కేసులో హీరో శివాజీ మళ్లీ పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు. 'మా అబ్బాయిని అమెరికాలోని ఓ స్కూళ్లో చేర్పించాల్సి ఉంది. లుక్‌ఔట్‌ నోటీసు ఉన్నందు న హైకోర్టు అనుమతి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాను.

ఈ పరిస్థితుల్లో నేను విచారణకు రాలేను' అంటూ సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీ‌సస్టేషన్‌కు శివాజీ ఈ-మెయిల్‌ పంపారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల శివాజీని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మళ్లీ నోటీసు జారీ చేసి 11న విచారణకు రావాలన్నారు. కానీ ఆయన రాకుండా, మెయిల్‌ పంపారు.

English summary
Ravi Prakash, former CEO of TV9 The anticipatory bail was granted by the High Court on Friday. The High Court has ordered Raviprakash to appear before the police once a week. Similarly, the court has warned Ravi Prakash not to leave the country without permission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X