వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా కంటపడకుండా రవితేజ ప్రయత్నం! డ్రగ్స్‌పై కేసీఆర్

నటుడు రవితేజ శుక్రవారం సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) ఎదుట హాజరుకానున్నారు. ఆయన మీడియా కంటపడకుండా ఎక్సైజ్ కార్యాలయానికి రావాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నటుడు రవితేజ శుక్రవారం సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) ఎదుట హాజరుకానున్నారు. ఆయన మీడియా కంటపడకుండా ఎక్సైజ్ కార్యాలయానికి రావాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

చదవండి: రవితేజ చుట్టు ఉచ్చు?: డ్రగ్ ముఠాతో పరిచయం ఎలా.. విస్తుపోయే అంశాలు?

ఇందుకోసం ఆయన తాను ఉంటున్న ఇంటి నుంచి ఓ హోటల్‌కు మకాం మార్చారనే ప్రచారం సాగుతోంది. ఎవరికీ తెలియకుండా, మీడియా కంటపడకుండా విచారణకు హాజరవ్వాలని భావిస్తున్నాంటున్నారు.

Ravi Teja trying to avoid media on friday!

డ్రగ్స్ గురించి ఆలోచించలేదు: కేసీఆర్

హైదరాబాదుతో పాటు టాలీవుడ్‌ను కుదుపుకుదిపేస్తున్న డ్రగ్స్ దందాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో స్పందించారు. దాడులు చేయాలని తాము ఆదేశించలేదని చెప్పారు. నకిలీ విత్తనాలు ప్రతి ఏటా సమస్యగా మారుతున్నాయని, వాటిని ఏరిపారేయాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించానన్నారు.

చదవండి: రవితేజ అలా ఇరుక్కున్నాడా: ఎన్నో ప్రశ్నలు-మరెన్నో అనుమానాలు, ఏది నిజం!?

అయితే నకిలీ విత్తనాల గురించి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఊహించని విధంగా డ్రగ్స్ తీగ కాలికి తగిలిందన్నారు. దర్యాప్తు ప్రారంభిస్తే భవిష్యత్ తరాలకు ఇది అంటుకుంటుందని గుర్తించామన్నారు. ఉక్కుపాదం మోపాలని సూచించానన్నారు.

డ్రగ్స్ దందాలో ఎంతటివారున్నా వదలొద్దని చెప్పానని, విచారణలో అకున్ సబర్వాల్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చానని చెప్పారు. తొలుత చిన్నవారు, తరువాత పెద్దవారు, ఇప్పుడు అంతర్జాతీయ స్మగ్లర్లు బయటపడుతున్నారన్నారు.

English summary
On Friday, actor Ravi Shankar Raju Bhupathiraju, popularly known as Ravi Teja, would appear before the SIT. His brother Bharath, who died in a road accident in the city recently, was arrested in a drugs case a few years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X