వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయన బిల్డింగ్ కూల్చేయండి: టిఆర్ఎస్‌లో చేరిన టిడిపి ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవలే అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరిన కేపీ వివేకానందకు హైకోర్టులో మంగళవారం షాక్ తగిలింది! ఎమ్మెల్యే వివేకానంద కుటుంబ సభ్యులకు చెందిన అక్రమాస్తులను కూల్చేయాలని జిహెచ్ఎంసిని హైకోర్టు ఆదేశించింది.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులు నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని జిహెచ్ఎంసి అధికారులను హైకోర్టు ఆదేశించింది. కుత్బుల్లాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 79 నుంచి 82 వరకు ఉన్న స్థలంలో నిర్మించిన వాణిజ్య భవనం పూర్తిగా అక్రమమేనని హైకోర్టు పేర్కొంది.

నిబంధనలకు విరుద్ధంగా సెట్‌బ్యాక్ లేకుండా, పార్కింగ్ ఏర్పాట్లు లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చి వేయాలని జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలోని న్యాయస్థానం ఉత్తర్వులు వెలువరించింది. సోమవారమే ఉత్తర్వులు వెలువరించినప్పటికీ, తీర్పు ప్రతి మంగళవారం అందుబాటులోకి వచ్చింది.

Raze Illegal Constructions by MLA’s Kin: HC to GHMC

ఈ భవనంలో కొనసాగుతున్న విద్యాసంస్థల్ని జూన్ 1 వ తేదీ నాటికి ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో నారాయణ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. వాటికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అక్రమ నిర్మాణాలను కూల్చివేసి నివేదికను, ఫొటోలను జూన్ 15 నాటికి హైకోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించాలని జిహెచ్ఎంసి అధికారుల్ని ఆదేశించింది. అంతేకాకుండా అక్రమనిర్మాణం జరుగుతున్నప్పుడు ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గృహ నిర్మాణ అనుమతితో వాణిజ్య భవనాన్ని నిర్మించి ఓ విద్యా సంస్థకు లీజుకు ఇచ్చారని, పైగా నిబంధనలు పాటించలేదని స్వయంగా ఆయన పినతండ్రి కెఎం ప్రతాప్ గత ఏడాది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. తద్వారా కార్పోరేషన్‌కు రూ.60 లక్షల రుసుము ఎగవేశారని పేర్కొన్నారు. వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

English summary
The Hyderabad High Court has directed the GHMC to demolish portions of the two buildings which are constructed in violation of the sanctioned plan by the family members of MLA KP Vivekanand, who represents Qutubullapur constituency, in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X