వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కాంగ్రెస్‌లో ‘జనసేన’ కుమ్ములాట.. నాయకుల మధ్య యురేనియం చిచ్చు!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన అఖిలపక్ష సమావేశం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు రేపింది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పవన్‌కళ్యాణ్ ఈ నెల 16న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుండి వీ.హనుమంతరావుతోపాటు ఇతర నాయకులు హజరయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ సమావేశానికి హజరు కావడంపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ చేపట్టిన సమావేశానికి ఎలా వెళతారని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమం పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా హజరయ్యారు. ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ అఖిలపక్ష సమావేశంపై చర్చ జరిగింది. ఇందులో భాగంగానే యురేనియం అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిందని, కాని క్రెడిట్ పవన్ కళ్యాణ్‌కు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీకి వ్యవహరించిందని సమావేశంలో పాల్గోన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ అన్నారు.

RC Khuntia and Sampath kumar questions leader attending Jana sena meeting

యురేనియం సమస్యకు పవన్‌ కళ్యాణ్‌కు సంబంధం ఏమిటిని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా వచ్చారా అంటూ నేతలను ప్రశ్నించారు. జనసేన పార్టీ జెండా క్రింద చేపట్టిన సమావేశానికి జాతీయ కాంగ్రెస్ నేతలుగా ఎలా వెళతరాని ఆగ్రహం వ్వక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కుంతియా పాల్గోన్న సభ్యత్వ కార్యక్రమం ఒక్కసారిగా వేడెక్కింది.

అయితే సంపత్ వ్యాఖ్యలతో కుంతియా సైతం ఏకిభవించారు. జనసేన పార్టీ పరంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడంపై పార్టీ సీనియర్ నేతలు కొంతమంది క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది. ఇాలాంటీ సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేసిన రోజే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యురేనియం తవ్వకాలను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. అనంతరం ఏకగ్రీవంగా సభలో తీర్మాణం చేయించారు.కాగా ఇదంతా పవన్‌ కళ్యాణ్‌కు వెళ్లినట్టు కొంతమంది పార్టీ నేతలు భావిస్తున్నారు.

English summary
The all-party meeting held by Janasena chief Pawan has sparked controversy in the Telangana Congress Party. RC Khuntia and Sampath kumar questioned leaders for attending the meeting conducted by Pawan Kalyan on behalf of Jana Sena Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X