వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, విద్యుత్‌పై చర్చకు నేను రెఢీ: రేవంత్‌కు సుమన్ సవాల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విద్యుత్ అంశంపై చర్చకు తాము సిద్దమని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ చెప్పారు.విద్యుత్ అంశంపై మేం చెప్పేది తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని బాల్క సుమన్ సవాల్ విసిరారు.

దివాళా కంపెనీలతో ఒప్పందాలు, మాట వినలేదని ఐఎఎస్‌లను తప్పించారు: కెసిఆర్‌పై రేవంత్ సంచలనందివాళా కంపెనీలతో ఒప్పందాలు, మాట వినలేదని ఐఎఎస్‌లను తప్పించారు: కెసిఆర్‌పై రేవంత్ సంచలనం

విద్యుత్ అంశంపై టిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ప్రకటించారు. దివాళా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్దమని కూడ ఆయనప్రకటించారు.

సుమన్ సవాల్‌‌కు రేవంత్ సై: జనవరి 12న, చర్చకు రెఢీ, ఎవరు ముక్కు రాస్తారో చూద్దాంసుమన్ సవాల్‌‌కు రేవంత్ సై: జనవరి 12న, చర్చకు రెఢీ, ఎవరు ముక్కు రాస్తారో చూద్దాం

రేవంత్ వ్యాఖ్యలపై టిఆర్ఎస్ బుదవారం నాడు స్పందించింది. టిఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ రేవంత్ విమర్శలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.విద్యుత్ అంశంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని బాల్క సుమన్ ప్రకటించారు.

విద్యుత్ పై చర్చకు సిద్దం

విద్యుత్ పై చర్చకు సిద్దం

విద్యుత్‌పై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని టిఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ చెప్పారు.విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు.టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ ముందుచూపు కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ మిగులులోకి వచ్చిందని బాల్క సుమన్ చెప్పారు.

కాంగ్రెస్ నేతలు అవమానించారు, వైఎస్‌తో విభేధాలు: డి.శ్రీనివాస్కాంగ్రెస్ నేతలు అవమానించారు, వైఎస్‌తో విభేధాలు: డి.శ్రీనివాస్

ముక్కు నేలకు రాస్తా

ముక్కు నేలకు రాస్తా

విద్యుత్ విషయమై తాము చెప్పేది అబద్దమని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ చెప్పారు.కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అవాస్తవమని తేలితే అబిడ్స్‌లో ముక్కు నేలకు రాస్తారా అని బాల్క సుమన్ సవాల్ విసిరారు.

చర్చకు సమయం, తేది రేవంత్ చెప్పాలి

చర్చకు సమయం, తేది రేవంత్ చెప్పాలి

విద్యుత్ విషయంలో చర్చకు తాను సిద్దంగా ఉన్నానని బాల్క సుమన్ చెప్పారు. అయితే చర్చకు సమయం , తేదిని రేవంత్ రెడ్డి చెప్పాలని బాల్క సుమన్ చెప్పారు.ఎప్పుడైనా చర్చకు సిద్దమని బాల్క సుమన్ చెప్పారు.

కెసిఆర్ ను సన్మానించేందుకు రెడీ కావాలి

కెసిఆర్ ను సన్మానించేందుకు రెడీ కావాలి

తెలంగాణలో కెసిఆర్ ముందు చూపు కారణంగానే మిగులు విద్యుత్ దిశగా తెలంగాణ రాష్ట్రం సాగుతోందని బాల్క సుమన్ చెప్పారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో 15 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని సాధించనున్నట్టు బాల్క సుమన్ చెప్పారు. భూపాలపల్లి, ఆర్ టీ పీపీలో ఒకేసారి పనులు ప్రారంభమైనా భూపాలపల్లిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. కానీ, ఆర్ టీ పీపీలో ఎందుకు ప్రారంభం కాలేదని బాల్క సుమన్ ప్రశ్నించారు.

జానా, ఉత్తమ్ తో వచ్చినా అభ్యంతరం లేదు

జానా, ఉత్తమ్ తో వచ్చినా అభ్యంతరం లేదు

విద్యుత్ విషయమై చర్చకు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి రేవంత్ రెడ్డి వచ్చినా తనకు అభ్యంతరం లేదని బాల్క సుమన్ ప్రకటించారు. విద్యుత్ పై కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి చెబుతున్నదంతా అబద్దమని నిరూపించేందుకు తాను సిద్దమని బాల్క సుమన్ ప్రకటించారు.

English summary
I will ready to discuss with congress leader revanth reddy on electricity issue said Trs Mp Balka Suman . Balka Suman spoke to media on wednesday at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X