వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబుతో క‌లిసి ప‌నిచేయ‌డానికి ఇప్ప‌టికీ సిద్ద‌మే..! రేవంత్ రెడ్డి మంచి మిత్రుడే.!మోత్కుప‌ల్లి..

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ మాజీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఆలోచ‌నా విధానంలో మార్పు వ‌చ్చిందా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కూ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని ఏదో వివాదంలోకి లాగి ఇష్టం వ‌చ్చిన‌ట్టు అనుచిత వాఖ్య‌లు చేసే మోత్కుప‌ల్లి ఇప్పుడు తన వైఖ‌రి మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తోపాటు ఏపి సీయం చంద్ర‌బాబును సైతం వ‌దిలి పెట్ట‌ని మోత్కుప‌ల్లి ఇక మీద‌ట వారి ప‌ట్ల క‌ర్క‌షంగా వ్య‌వ‌హ‌రించ‌బోర‌ట‌. నిన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబును, రేవంత్ రెడ్డిని క‌లిపి ఏకి పారేసిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అక‌స్మాత్తుగా ఎందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నారో అంతుచిక్క‌కుండా ఉంది. ఇంత‌కీ రేవంత్ రెడ్డి, చంద్ర‌బాబుల‌ పై మోత్కుప‌ల్లి చూపిస్తున్న సాఫ్ట్ కార్న‌ర్ వెన‌క ఉన్న అస‌లు మ‌త‌ల‌బు ఏంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

 రేవంత్ రెడ్డితో శ‌త్రుత్వం లేదు.! మ‌ళ్లీ టీడిపి ఆహ్వానిస్తే వెళ్తానంటున్న మోత్కుప‌ల్లి..!!

రేవంత్ రెడ్డితో శ‌త్రుత్వం లేదు.! మ‌ళ్లీ టీడిపి ఆహ్వానిస్తే వెళ్తానంటున్న మోత్కుప‌ల్లి..!!

తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ అదే పార్టీ పైన అనుచిత వాఖ్య‌లు చేసిన ఏకైక నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర్పింహులు. సుధీర్గ రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని చెప్పుకుంటున్న మోత్కుప‌ల్లి పార్టీని ప‌ట్టాలెక్కించి ప‌రుగులు పెట్టించాల్సిందిపోయి, ఏకంగా టీడీపీ ని గులాబి పార్టీలో విలీనం చెయ్యాల‌ని సాహసోపేత వ్యాఖ్య‌లు చేసారు. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు పైన హ‌ద్దులు దాటి ఆరోప‌ణ‌లు చేసారు. టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుపుకునే మ‌హానాడు రోజున చంద్ర‌బాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు స‌మాధానంగా పార్టీ ఆయ‌న‌కు ఉద్వాస‌న ప‌లికింది. అప్ప‌ట్నుంచి మ‌రింత రెచ్చిపోయిన మోత్కుప‌ల్లి వైసిపి నేత‌ల‌తో చేయి క‌లిపారు.

నిన్న‌టి వ‌ర‌కూ తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టిన మోత్కుప‌ల్లి..!ఇక మీద‌ట అలా చేయ‌డ‌ట‌..!!

నిన్న‌టి వ‌ర‌కూ తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టిన మోత్కుప‌ల్లి..!ఇక మీద‌ట అలా చేయ‌డ‌ట‌..!!

తెలంగాణ‌లో విలేఖ‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి చంద్ర‌బాబును దూషిస్తుంటే స‌రైన మైలేజ్ రావ‌ట్లేద‌ని భావించిన మోత్కుప‌ల్లి తిరుప‌తి వెళ్లి అక్క‌డ కూడా చంద్ర‌బాబు పై తిట్ల పురాణం అందుకున్నాడు. ఎస్ సి వ‌ర్గీక‌ర‌ణ కు కాపు వ‌ర్గీక‌ర‌ణ లింక్ పెట్టి ఈ మ‌ద్య చంద్ర‌బాబును దూషించారు. చంద్ర‌బాబుతో పాటు పార్టీ మారిన రేవంత్ ను సైతం మోత్కుప‌ల్లి ఉపేక్షించ‌లేదు. ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ప్ర‌తిష్ట‌ని గంగ‌లో క‌లిపాడ‌ని రేవంత్ పై నిప్పులు చెరిగారు మోత్కుప‌ల్లి. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చెయ్యాల‌నుకున్న రేవంత్ రెడ్డిని చంద్ర‌బాబు ప్రోత్స‌హించార‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేసారు. అనుకోని సంద‌ర్భంలో తాను ఒక చిన్న పొర‌పాటు చేసినందుకు పెద్ద శిక్ష విధించార‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబు పై మండిప‌డ్డారు.

ఏ పార్టీలో పొస‌గ‌లేని మోత్కుప‌ల్లి..! మ‌ళ్లీ సొంత‌పార్టీ వైపే చూపు..!!

ఏ పార్టీలో పొస‌గ‌లేని మోత్కుప‌ల్లి..! మ‌ళ్లీ సొంత‌పార్టీ వైపే చూపు..!!

చంద్ర‌బాబుతో పాటు రేవంత్ రెడ్డి పై ప్ర‌తీకార జ్వాల‌తో ర‌గిలిపోతున్న మోత్కుప‌ల్లి వైఖ‌రిలో అకస్మాత్తుగా మార్పు చోటు చేసుకుంది. తాను ఇక మీద‌ట రేవంత్ రెడ్డిని దూషించే ప్ర‌క్రియ‌కు పుల్ స్టాప్ పెడుతున్న‌ట్టు సంచ‌ల‌న వాఖ్య‌లు చేసారు. అంతేకాకుండా త‌న కామెంట్ల ప‌ట్ల రేవంత్ ఎలా స్పందిచేవార‌ని మోత్కుప‌ల్లి ఆరా తీసినట్టు విశ్వ‌సనీయ స‌మాచారం. రేవంత్ రెడ్డితో త‌న‌కెలాంటి అభిప్రాయ భేదాలు లేవ‌ని, అలాగే దీర్ఘ‌కాల శ‌త్రుత్వం కూడా లేద‌ని మోత్కుప‌ల్లి తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న‌ప్పుడు పార్టీ భ‌విత‌వ్యాన్ని రేవంత్ చూసుకునేలా , వెనుక‌బ‌డిన వ‌ర్గాల అభ్యున్న‌తిని తాను చూసుకునేలా ప్రణాళిక‌ను తానే ర‌చించిన‌ట్లు మోత్కుప‌ల్లి వివ‌రించిన‌ట్టు స‌మాచారం. ఇంత‌కీ చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి పేరు చెబితేనే పూన‌కం వ‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించే మోత్కుప‌ల్లి వారిద్ద‌రి ప‌ట్ల సానుకూలంగా మాట్లాడ‌టం వెనుక మ‌రో కోణం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

చంద్ర‌బాబుతో శ‌త్రుత్వం ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మే..! క‌లిసి ఉంటేనే క‌ల‌దు సుఖం అంటున్న న‌ర్సింహులు..!!

చంద్ర‌బాబుతో శ‌త్రుత్వం ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మే..! క‌లిసి ఉంటేనే క‌ల‌దు సుఖం అంటున్న న‌ర్సింహులు..!!

తెలుగుదేశం పార్టీ మోత్కుప‌ల్లిని బ‌హిష్క‌రించిన‌ప్ప‌ట్నుంచి ఆయ‌న ప‌రిస్థితి చౌర‌స్తాలో చంటిపిల్లాడిలా త‌యార‌య్యింది. బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌యిన త‌ర్వాత మోత్కుప‌ల్లిని ప‌లు పార్టీల నేత‌లు సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. ఇక మోత్కుప‌ల్లి స్వ‌యంగా గులాబి బాస్ తో మంత‌నాలు జ‌రిపి టీఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న‌ట్టు చెప్పార‌ట‌. మోత్కుప‌ల్లి ప్ర‌తిపాద‌న‌ను సిఎం కెసిఆర్ సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలుసింది. దీంతో తెలంగాణ‌లో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. మోత్కుప‌ల్లి రాజ‌కీయ ప్ర‌స్థానానికి , త‌న సుదీర్ఘ రాజ‌కీయ జీవితానికి అర్ధం ప‌ర‌మార్ధం చ‌కూరాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క‌టే చుక్కానిగా కనిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మోత్కుప‌ల్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే జాతీయ స్థాయిలో చంద్ర‌బాబు అండ‌దండ‌లు, ప్రాంతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి స‌హ‌కారం ఎంతో అవ‌స‌రం. దీంతో అటు చంద్ర‌బాబు పైన ఇటు రేవంత్ రెడ్డి పైన సాఫ్ట్ కార్న‌ర్ చూపిస్తున్న‌ట్టు మోత్కుప‌ల్లి వ‌ర్గాలు తెలియ చేస్తున్నాయి. మోత్కుప‌ల్లి స‌డెన్ యూట‌ర్న్ ప‌ట్ల అటు చంద్ర‌బాబు కాని, ఇటు రేవంత్ రెడ్డి కాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

English summary
telangana tdp farmer senior leader motkupalli narasimhulu planning to come back his own party in telangana. he is showing soft corner. the followers mothkupally saying, behind mothkupally thinking there is huge political strategy. for his political jouirney mothkupally expecting chandra babu coaperation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X