వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్యాన్స్‌పై సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్ ఆగ్రహానికి కారణమదే... కాలికి గాయం.. ఆరు కుట్లు...

|
Google Oneindia TeluguNews

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ విన్నర్‌, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ కాలికి గాయమైంది. గాయమైన చోట ఆరు కుట్లు పడ్డాయి. ఈ విషయాన్ని స్వయంగా రాహులే వెల్లడించాడు. ఆదివారం(ఫిబ్రవరి 21) సాయంత్రం వరంగల్‌లోని హన్మకొండలో రాహుల్ బట్టల స్టోర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులు భారీగా తరలిరావడం... వారిని అదుపుచేయడం కష్టతరం కావడంతో రాహుల్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే తానలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం తన కాలికి తగిలిన గాయమేనని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపాడు.

'పొద్దున్నే నా కుడికాలి చిటికెన వేలికి దెబ్బ తగిలింది. ఆరు కుట్లు పడ్డాయి. బట్టల స్టోర్ ప్రారంభోత్సవంలో 20 మంది దాకా నా కాలిని తొక్కేశారు. కుట్ల నుంచి రక్తం కారుతోంది. ఎక్కడ కుట్లు ఊడిపోతాయేమోనని భయపడ్డాను. అంతే.. కానీ మీ అందరికీ నా కోపమే కనబడుతోంది. ఏదైమైనా ఓరుగల్లులో స్టోర్ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది.' అని రాహుల్ తన ఇన్‌స్టాలో చెప్పుకొచ్చాడు.

reason behind singer rahul sipligunj anger on fans in warangal

రాహుల్ సిప్లిగంజ్ ఇటీవలే 'ఊకో కాకా..' పేరుతో బట్టల వ్యాపారంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్లలో ఈ స్టోర్లను ప్రారంభించాడు. ఇదే క్రమంలో వరంగల్‌లోనూ ఆదివారం స్టోర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ అక్కడికి వెళ్లడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

దీంతో వారిని అదుపుచేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో రాహుల్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయగా... దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెలబ్రిటీ అయ్యాక రాహుల్ పొగరు చూపిస్తున్నాడంటూ కొందరు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ తన ఆగ్రహానికి అసలు కారణాన్ని వెల్లడించాడు.

English summary
Bigg Boss' third season winner, Singer Rahul Sipliganj was injured. Six stitches were applied to the wound. Rahul himself revealed this. On Sunday (February 21) evening, Rahul opened a clothing store at Hanmakonda in Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X