• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టాలీవుడ్ ప్రముఖులతో కేసీఆర్ భేటీ కాబోతున్నారా..? తలసాని భేటీ వెనుక ఆంతర్యమేంటీ..?

|

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిరంజీవి,నాగార్జునలతో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. అయితే ఉన్నట్టుండి తలసాని చిరు,నాగ్‌లతో భేటీ అవడం వెనుక కారణమేంటన్న చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ ఆదేశాల మేరకే తలసాని వారితో భేటీ అయినట్టు తెలుస్తోంది.

గతేడాది ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా.. త్వరలోనే ఫిలిం ఇండస్ట్రీతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్‌ను సినీ హబ్‌గా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని తానే స్వయంగా ముందుండి పర్యవేక్షిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో చిరు,నాగ్‌లతో తలసాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

 భేటీకి కారణమేంటీ..

భేటీకి కారణమేంటీ..

గతేడాది జరిగిన టీవీ9 నవ నక్షత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి సహా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఇండస్ట్రీకి ఓ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను సినీ హబ్‌గా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని.. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు త్వరలోనే టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తానని అన్నారు. అంతేకాదు,ఆ ప్రణాళికలు,దానికి సంబంధించిన కార్యక్రమాలను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో

తాను హామీ ఇచ్చినట్టుగా కేసీఆర్ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులతో స్వయంగా సమావేశం కాబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. తాజాగా చిరు,నాగ్‌లతో తలసాని భేటీ అందుకు ఊతమిచ్చింది.

 గతేడాది హామీ ఇచ్చిన కేసీఆర్..

గతేడాది హామీ ఇచ్చిన కేసీఆర్..

గత ఐదేళ్ల కాలంలో తమ పూర్తి కాలాన్ని కరెంట్,సాగునీరు,తాగునీరు ఇతరత్రా సంక్షేమ,అభివృద్ది పథకాలకే వెచ్చించామని కేసీఆర్ ఆ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇకపై సినీ ఇండస్ట్రీ అభివృద్దిపై ఫోకస్ చేస్తామని, హైదరాబాద్‌ను సినీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతామని చెప్పారు. దీనిపై ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు కేసీఆర్ తలసానిని వారి వద్దకు పంపించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చిరు,నాగ్‌లతో భేటీ అయిన తలసాని.. మరికొందరు ప్రముఖులతోనూ భేటీ అవనున్నట్టు సమాచారం. అయితే త్వరలో ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసేందుకే కేసీఆర్ తలసానిని వారి వద్దకు పంపించారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

 గతంలో చిరు కూడా..

గతంలో చిరు కూడా..

తెలుగు చిత్రపరిశ్రమకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సీఎం కేసీఆర్ సిద్దంగా ఉన్నారని చిరంజీవి కూడా గతంలో తెలిపారు. జనవరి 2న జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో దీనిపై మాట్లాడారు. ఇండస్ట్రీకి ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు అవసరమో.. త్వరలోనే అంతా కలిసి చర్చించుకుందామని కోరారు. ఓ ప్రణాళిక,కార్యాచరణతో సీఎంను కలుద్దామని చెప్పారు.

 హాట్ టాపిక్‌గా మారిన భేటీ..

హాట్ టాపిక్‌గా మారిన భేటీ..

తాజాగా తలసానితో భేటీలో చిరంజీవి,నాగార్జున టీఆర్ఎస్‌కు శుభాకాంక్షలు కూడా తెలిపినట్టు సమాచారం. ఇటీవలి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడంతో వారు శుభాకాంక్షలు తెలిపినట్టు తెలుస్తోంది. సమావేశంలో సినీ ఇండస్ట్రీ విషయాలతో పాటు ఇటీవల జరిగిన పలు సంఘటనలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా చిరు,నాగ్‌లతో తలసాని భేటీ హాట్ టాపిక్‌గా మారింది.

English summary
Telangana cinematography minister Talasani Srinivas had a special meeting with Yadav Chiranjeevi and Nagarjuna on Tuesday. The visit took place at Chiranjeevi's residence in Jubilee Hills, Hyderabad. However, it seems that Tasani had only met with them on the orders of KCR.During a function last year KCR said that a special meeting with the film industry will be held soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more