వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొల్లాపూర్‌లో కారు పంక్చర్, రెబల్స్ హవా, క్యాంపుకు తరలించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

|
Google Oneindia TeluguNews

మున్సిపోల్స్‌లో గులాబీ గుబాళిస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొంది. కానీ కొల్లాపూర్‌లో మాత్రం ఆ పార్టీకి చుక్కెదురైంది. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోద్బలంతో రెబల్స్ విజయానికి అడుగుదూరంలో నిలిచారు. కొల్లాపూర్‌లో 20 చోట్ల రెబల్స్ పోటీ చేయడం విశేషం. వీరందరికీ జూపల్లి అండదండగా ఉన్నారు. మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగిన జూపల్లి మాత్రం దారిలోకి రాలేదు. దీంతో కొల్లాపూర్ మున్సిపాలిటీ చర్చకు దారితీసింది.

కొల్లాపూర్‌లో రెబల్స్ హవా

కొల్లాపూర్‌లో రెబల్స్ హవా

కొల్లాపూర్‌లో ఆరుగురు రెబల్స్ విజయం దిశగా అడుగెస్తున్నారు. వీరి విజయం దాదాపు ఖాయమేనని జూపల్లి వర్గీయులు చెప్తున్నారు. ఆ ఆరుగురిని జూపల్లి క్యాంపునకు తరలిస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి మహహూబ్ నగర్ జిల్లాలో 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. 15 చోట్ల టీఆర్ఎస్ కైవసం చేసుకోగా.. కొల్లాపూర్, ఐజాలో మాత్రం పరిస్థితి తారుమారైంది. ఇక్కడ మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తన అనుచరులకు ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ గుర్తుమీద పోటీ చేయించారు. సింహాం గుర్తుతో అభ్యర్థులు బరిలోకి దిగారు. కొల్లాపూర్‌లో జూపల్లి మేనల్లుడు నర్సింహారావు 400 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

20 మంది రెబల్స్

20 మంది రెబల్స్

కొల్లాపూర్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి జూపల్లి వర్గం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 20 మందిని రెబల్స్‌గా జూపల్లి బరిలోకి దింపారు. తన అనుచరులకు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో.. ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయించారు. వారు గెలిచేందుకు శాయశక్తులు ఒడ్డారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి వర్గానికి టీఆర్ఎస్ సీట్లు కేటాయించడంతో వివాదం చెలరేగింది. దీంతో జూపల్లి.. తన వర్గానికి ఫార్వార్డ్ బ్లాక్ నుంచి టికెట్లు కేటాయించారు.

కేటీఆర్ చెప్పినా..

కేటీఆర్ చెప్పినా..

రెబల్స్ గురించి హర్షవర్థన్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్ రంగంలోకి దిగి.. రెబల్స్‌పై వెనక్కి తగ్గాలని సూచించినా.. జూపల్లి స్పందించలేదు. దీంతో రెబల్స్ పోటీ చేసి.. విజయం సాధిస్తున్నారు. మిగతాచోట్ల టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతోన్న.. కొల్లాపూర్‌లో మాత్రం కారు స్పీడు‌కు జూపల్లి బ్రేకులు వేశారు. ఇప్పటికే గెలిచిన అభ్యర్థులను క్యాంపునకు కూడా తరలించారు.

మిగతాచోట్ల హవా

మిగతాచోట్ల హవా


మొత్తం 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. వార్డులు, డివిజన్లవారీగా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. 5 నుంచి 24 రౌండ్లలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియనుంది. కాగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఫలితాల్లో దూసుకెళ్తుంది.

English summary
rebels victory in kollapur municipality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X