వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాదాద్రి పవర్ ప్లాంటుకు రూ. 16వేల కోట్లు: కెసిఆర్‌కు అందించిన రాజీవ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని దామరచర్ల వద్ద నెలకొల్పనున్న యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణానికి, విద్యుత్ ఉత్పత్తి కోసం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) 16,070కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన చెక్కును ఆర్‌ఈసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్‌శర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందిస్తూ.. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని చెప్పారు. అన్ని విధాలా సహకారం, ప్రోత్సాహం అందుతుండటంపై ఆనందం వ్యక్తంచేశారు.

తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులకోసం ఆర్‌ఈసీనుంచి ఇప్పటివరకు రూ.20,391 కోట్లు అందాయి. ఒక రాష్ర్టానికి ఇంత మొత్తంలో నిధులు ఒకేసారి ఇవ్వడం తమ సంస్థ చరిత్రలోనే మొదటిసారి అని రాజీవ్‌శర్మ తెలిపారు.

కెసిఆర్‌తో ఆర్ఈసి ఛైర్మన్

కెసిఆర్‌తో ఆర్ఈసి ఛైర్మన్

నల్గొండ జిల్లాలోని దామరచర్ల వద్ద నెలకొల్పనున్న యాదాద్రి పవర్ ప్లాంటు నిర్మాణానికి, విద్యుత్ ఉత్పత్తి కోసం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) 16,070కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

కెసిఆర్‌తో ఆర్ఈసి ఛైర్మన్

కెసిఆర్‌తో ఆర్ఈసి ఛైర్మన్

ఇందుకు సంబంధించిన చెక్కును ఆర్‌ఈసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్‌శర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం అందజేశారు.

కెసిఆర్‌తో ఆర్ఈసి ఛైర్మన్

కెసిఆర్‌తో ఆర్ఈసి ఛైర్మన్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందిస్తూ.. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని చెప్పారు. అన్ని విధాలా సహకారం, ప్రోత్సాహం అందుతుండటంపై ఆనందం వ్యక్తంచేశారు.

కెసిఆర్‌తో ఆర్ఈసి ఛైర్మన్

కెసిఆర్‌తో ఆర్ఈసి ఛైర్మన్

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తికోసం అవసరమయ్యే నిధులను సమకూర్చే ఆర్‌ఈసీ మూడునెలల కిందట పాల్వంచలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నెలకొల్పేందుకు రూ.4,321 కోట్లు అందించిన సంగతి తెలిసిందే.

కెసిఆర్‌తో ఆర్ఈసి ఛైర్మన్

కెసిఆర్‌తో ఆర్ఈసి ఛైర్మన్

ఒక రాష్ర్టానికి ఇంత మొత్తంలో నిధులు ఒకేసారి ఇవ్వడం తమ సంస్థ చరిత్రలోనే మొదటిసారి అని రాజీవ్‌శర్మ తెలిపారు.

కెసిఆర్‌తో ఆర్ఈసి ఛైర్మన్

కెసిఆర్‌తో ఆర్ఈసి ఛైర్మన్

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధిని చూసి, ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికోసం చేపట్టిన ప్రణాళికలపై నమ్మకంతోనే నిధులు ఇచ్చినట్లు తెలిపారు. విద్యుత్ ప్లాంట్ల కోసం ఇచ్చే డబ్బులకు సాధారణంగా 11.5 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా, తెలంగాణకు ఇచ్చే రుణానికి 11 శాతం మాత్రమే తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

వడ్డీ శాతం తగ్గడంవల్ల తెలంగాణకు రూ.500 కోట్లకు పైగా ఆదా అవుతుందని ఆయన వివరించారు. ఆర్‌ఈసీ మాత్రమే కాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమయ్యే రూ.4వేల కోట్లను సమకూర్చినట్లు తెలిపారు.

English summary
Rural Electrification Corporation today lent Rs 16,070 crore to Telangana government for a power project. REC chairman and managing director Rajiv Sharma handed the cheque to Chief Minister K Chandrasekhar Rao here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X