హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెరీ డెంజరస్: కెనడా టు రెజినా: ఏమిటీ కికి ఛాలెంజ్, ఎందుకు ప్రమాదకరం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

వెరీ డెంజరస్: కెనడా టు రెజినా: ఏమిటీ కికి ఛాలెంజ్

హైదరాబాద్/న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా కికి ఛాలంజ్ పేరు బాగా వినిపిస్తోంది. అన్నింటా దూకుడుగా ఉండే యువత దీని పట్ల ఎంతో క్రేజ్‌తో ఉన్నారు. కికి ఛాలెంజ్‌పై చాలామంది ఆసక్తితో ఉన్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరం కాబట్టి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరైనా కికి ఛాలెంజ్ నిర్వహించినా, విసిరినా కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు.

ప్రమాదకర కికి ఛాలెంజ్ వైపు మొగ్గు చూపకుండా పోలీసులు అప్రమత్తంప్రమాదకర కికి ఛాలెంజ్ వైపు మొగ్గు చూపకుండా పోలీసులు అప్రమత్తం

కికి ఛాలెంజ్ సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యాన్, యూపీ, ముంబై రాష్ట్రాలలోని యువత రాత్రి సమయాల్లో రోడ్ల పైకి వచ్చి కికి ఛాలెంజ్ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే నిర్మానుష్య రోడ్లపైకి వెళ్లి దీనిని చేస్తున్నట్లు గుర్తించి సీరియస్ అయ్యారు.

కికి ఛాలెంజ్ అంటే ఏమిటి?

కొద్ది రోజులుగా వినిపిస్తున్న కికి ఛాలెంజ్ అంటే యువతకు చాలామందికి తెలిసింది. అసలు కికి ఛాలెంజ్ అంటే ఏమిటనే ఆసక్తి ఉండవచ్చు. నడుస్తున్న కారులో నుంచి కిందకు దిగి కాసేపు పాటపాడి, దానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ అదే వేగంలో ఉన్న కారులోకి ఎక్కడమే కికి ఛాలెంజ్. ఆ సమయంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి వీడియో తీస్తాడు. దానిని పోస్ట్ చేస్తారు. ఇది ప్రమాదకరమైనది. అందుకే పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఎక్కడి నుంచి ప్రారంభమైంది?

మన వద్ద నటి ఆదాశర్మ కూడా ఈ ఛాలెంజ్ చేసింది. కానీ ఈమె నిలబడి ఉన్న కారుతో కికి ఛాలెంజ్ చేసింది.కెనడాకు చెందిన రాప్‌ సంగీతకారుడు డ్రేక్‌ జూన్‌ 30వ తేదీన కికి ఛాలెంజ్ పేరుతో ఓ వీడియోను సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. అతను నడుస్తున్న కారులో నుంచి దిగి, అదే వేగంతో వెళ్తున్న కారులోకి ఎక్కి సవాల్ చేశాడు. అతడి సవాల్‌‌ను కెనడా యువతతో పాటు క్రీడాకారులు, హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ డ్రేక్‌లు స్వీకరించారు. విల్ స్మిత్ నడుస్తున్న కారులోంచి బయటకు దూకి పాటపాడుతూ డ్యాన్స్ చేసిన వీడియోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు.

విల్ స్మిత్ వీడియోతో

విల్ స్మిత్ వీడియోతో

విల్ స్మిత్ వీడియోతో పాటు పలువురు ప్రముఖులు కూడా కికి ఛాలెంజ్ చేశారు. ఇవన్నీ సోషల్ మీడియాలో విస్తృతం అయ్యాయి. దీంతో మనదేశంలోని ఢిల్లీ, ముంబై వంటి నగర యువత రోడ్ల పైకి వచ్చి దీనిని కికి ఛాలెంజ్ చేసి స్నేహితులకు విసురుతున్నారు. కికి ఛాలెంజ్‌తో ప్రమాదాలు చోటు చేసుకుంటాయని గుర్తించిన పోలీసులు రాత్రిళ్లు కూడా బందోబస్తు చేపట్టారు. హైదరాబాదులోను ఈ ఛాలెంజ్‌కు ఉత్సాహపడతారని భావించి పోలీసులు అప్రమత్తమయ్యారు.

కికి ఛాలెంజ్ ప్రదర్శిస్తే ఈ చర్యలు

రోడ్లపై కికి ఛాలెంజ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇలాంటివి చేస్తే ఐపీసీ 268 సెక్షన్‌తో పాటు సిటీ పోలీస్‌ చట్టం సెక్షన్‌ 70(బి) ప్రకారం కేసులు నమోదు చేస్తామని అడిషనల్ పోలీస్‌ కమిషనర్ (ట్రాఫిక్‌) అనిల్ కుమార్‌ వివరించారు.

కికి ఛాలెంజ్‌పై హెచ్చరిక

కికి చాలెంజ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ హెచ్చరించారు. చాలామంది యువత వాహనాలు నడుపుతూ రోడ్లపై నృత్యాలు చేస్తూ, కదులుతున్న వాహనంపై నుంచి దూకుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. కికి చాలెంజ్‌కు ప్రేరణ పొంది యువకులు ఇలా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. కదులుతున్న కార్లపై నుంచి దూకడం, రోడ్డు మధ్యలో డ్యాన్సులు చేయడం చాలా ప్రమాదకరమని, వాహనాలు నడుపుతున్న వారితో పాటు అందులో ప్రయాణిస్తున్న వారికి, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ఇది ప్రమాదమన్నారు. ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకుంటున్నామని, కిక్కి చాలెంజ్‌కు ప్రేరేపితమై ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసే వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామన్నారు. అలాంటి స్టంట్లు, ప్రమాదకరమైన డ్రైవింగ్‌ల జోలికి వెళ్లవద్దన్నారు.

రెజినాపై సోషల్ మీడియాలో విమర్శలు

రెజినాపై సోషల్ మీడియాలో విమర్శలు

కికి ఛాలెంజ్ చేసిన నటి రెజినాపై సోషల్ మీడియాలోను విమర్శలు వచ్చాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని కూడా కొందరు పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదకర, స్టుపిడ్ ఛాలెంజ్‌ను ప్రమోట్ చేయడం పట్ల సిగ్గుపడాలని మరికొందరు అన్నారు. అసలు ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నందుకు మిమ్మల్ని జైలుకు పంపించాలని మరొక నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కికి ఛాలెంజ్ చేస్తున్న వారిలో చాలామందికి గాయాలవుతున్నాయి. పోలీసులకు కొందరు ఫిర్యాదులు చేస్తుండటంతో అరెస్టులు, జరిమానాలు చోటు చేసుకుంటున్నాయి.

English summary
Jumping out of a moving vehicle and dancing in the road doesn't sound like a great idea. But for the thousands of people around the world dancing to Drake's In My Feelings song, it's just another craze to be a part of.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X