వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో సంచలనం: త్వరలో జియో ల్యాప్ టాప్ లు, ఫీచర్లివే

టెలికం రంగంలో సంచలనాలకు రిలయన్స్ మారుపేరుగా నిలుస్తోంది. ఇప్పటికే జియో ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. త్వరలోనే మార్కెట్లోకి ల్యాప్ టాప్ లను ప్రవేశపెట్టనుంది జియో.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టెలికం రంగంలో సంచలనాలకు రిలయన్స్ మారుపేరుగా నిలుస్తోంది. ఇప్పటికే జియో ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది.

ఉచిత ఆఫర్లతో మార్కెట్లోకి ప్రవేశించింది జియో. జూన్ మాసం వరకు జియో తన ఆఫర్లను కొనసాగిస్తూనే ఉంది. రిలయన్స్ అనుసరిస్తున్న మార్కెట్ వ్యూహలు ఇతర టెలికం కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇప్పటికే ఇతర టెలికం కంపెనీలు తమ టారిఫ్ ప్లాన్లలో కూడ మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులను కల్పించింది జియో.

బ్రాడ్ బ్యాండ్ సేవలతో పాటు, కేబుల్ టీవి ప్రసారాలను ప్రారంభించాలని రిలయన్స్ జియో భావిస్తోంది.ఈ మేరకు త్వరలోనే ఈ సేవలను అందించనున్నట్టు ప్రకటించింది.

ల్యాప్ టాప్ లను ప్రవేశపెట్టనున్న జియో

ల్యాప్ టాప్ లను ప్రవేశపెట్టనున్న జియో


రిలయన్స్ జియో మార్కెట్లో క్లిక్ కావడంతో రిలయన్స్ మరిన్ని కొత్త ప్రొడక్ట్ ల వైపు ఆసక్తిని కనబరుస్తోంది. జియో ల్యాప్ టాప్ లను లాంచ్ చేయాలని భావిస్తోంది.భారత మార్కెట్లోకి జియో పవర్డ్ ల్యాప్ టాప్ లను అందించాలని ముఖేష్ అంబానీ కంపెనీ సన్నాహలు చేస్తోంది.

13.3 అంగుళాల స్క్రీన్ తో ల్యాప్ టాప్

13.3 అంగుళాల స్క్రీన్ తో ల్యాప్ టాప్

జియో ప్రారంభించనున్న ల్యాప్ టాప్ 13.3 అంగుళాల స్క్రీన్ సైజును కలిగి ఉంటుంది. ముఖ్యంగా ట్రావెలర్లను ఉద్దేశించి వీటిని తయారు చేస్తున్నట్టు సమాచారం. ఈ ల్యాప్ టాప్ లో జియో సిమ్ కార్డును ముందస్తుగానే అమర్చనున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి.ఈ ల్యాప్ టాప్ ల ద్వారా కూడ మరిన్ని జియో కనక్షన్లను పెంచుకోవచ్చని రిలయన్స్ భావిస్తోంది.

ల్యాప్ టాప్ లో అన్ని సౌకర్యాలు

ల్యాప్ టాప్ లో అన్ని సౌకర్యాలు


వాయిస్ ఓవర్ ఎల్టీఈ కాల్స్ ను ఈ ల్యాప్ టాప్ సపోర్ట్ చేస్తోందని ఫోన్ ర్యాడర్ రిపోర్ట్ చేసింది.జియో సిమ్ స్లాట్ , లెప్ట్ సైడ్ లో ఉంటుంది. విండోస్ లేదా క్రోమ్ ఓస్ తో ఇది పనిచేస్తోంది. వీడియో కాల్స్ మాట్లాడుకొనేందుకు వీలుగా డిస్ ప్లే పైనే హెచ్ డి కెమెరాను అమర్చనున్నారు.

1.2 కిలోల బరువుతో ల్యాప్ టాప్ తయారీ

1.2 కిలోల బరువుతో ల్యాప్ టాప్ తయారీ

4 జీబీ ర్యామ్, 64 జీబీ ఈఎంఎంసీ లేదా 128 జీబీ ఎస్టీడీ స్టోరేజీ, 12.2 ఎంఎం మందం, 1.2 కిలోల బరువు, మేగ్నిషియం ఆలోయ్ బాడీ దీనిలో ఉంటుంది.అయితే దీని ధరను రూ.35 నుండి 45 వేల రూపాయాలు ఉంటుందని అంచనా.ల్యాప్ టాప్ ను ఉపయోగించేవారు సిమ్ కనెక్టివిటీని కోరుకొంటున్నారు.

English summary
with the initial work on the Jio 4G rollout almost over, Reliance is now reportedly working on a Jio-powered laptop for the Indian market. The laptop, which is likely to have a 13.3-inch screen size, will be aimed at travellers and users who need computer on the go.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X