వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో బంపర్ ఆఫర్: ఏప్రిల్ కు ముందే రీచార్జీ చేసుకొంటే 10 జీబీ డేటా ఫ్రీ, ఉచిత ఆఫర్ పొడిగింపు?

రిలయన్స్ జియో బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. 2017 ఏప్రిల్ 1వ, తేది కంటే ముందుగానే రీ చార్జ్ చేసుకొంటే 10 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్టు రిలయన్స్ ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:రిలయన్స్ జియో బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. 2017 ఏప్రిల్ 1వ, తేది కంటే ముందుగానే రీ చార్జ్ చేసుకొంటే 10 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్టు రిలయన్స్ ప్రకటించింది.

టెలికం రంగంలో రిలయన్స్ జియో సంచలనాలకు కారణమైంది. ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపుతోంది రిలయన్స్ జియో.

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలకు పోటీదారుడిగా మారింది.ఇతర టెలికం కంపెనీలు కూడ ఉచిత ఆఫర్లను కూడ ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్ 1వ, తేది నుండి రిలయన్స్ జియో తన కస్టమర్ల నుండి చార్జీలను వసూలు చేయనుంది. అయితే ఇప్పటివరకు ఉచిత ఆఫర్లను ప్రకటించిన రిలయన్స్ జియో ఏప్రిల్ నుండి తమ కస్టమర్లనుండి చార్జీలు వసూలు చేయనుంది.

రిలయన్స్ జియో బంపర్ ఆఫర్

రిలయన్స్ జియో బంపర్ ఆఫర్

రిలయన్స్ జియో ను ఏప్రిల్ 1వ, తేదికంటే ముందుగానే రీచార్జీ చేసుకొంటే 10 జీబీ డేటాను ఉచితంగా అందించనుంది. రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్ షిప్ ను ఏప్రిల్ 1వ, తేది నాటికి పొందాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే జియో ప్రైమ్ మెంబర్ షిఫ్ ను తీసుకొన్నవారికే ఇది వర్తించనుంది.

రోజుకు ఉచిత అపరిమిత కాల్స్, 1 జీబీ డేటా

రోజుకు ఉచిత అపరిమిత కాల్స్, 1 జీబీ డేటా

రూ.149 రూపాయాలతో రిలయన్స్ జియో రీ చార్జ్ చేసుకొంటే 2 జీబీ డేటా పాటు అపరిమిత వాయిస్ కాల్స్ ను అందించనుంది రిలయన్స్ జియో. అదనంగా 1 జీబీ డేటాను కూడ పొందే అవకాశం ఉంది. ఇక రూ.303 ప్లాన్ లో ఇచ్చే 28 జీబీ డేటాతో పాటు ఉచితంగా మరో 5 జీబీ డేటాను కూడ జియో ఇవ్వనుంది. ఈ రెండింటితో పాటు రూ.499 రీచార్జీ చేసుకొంటే నెలవారీ పథకం కంద అందించనుంది.

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ గడువు పెంపు?

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ గడువు పెంపు?

రిలయన్స్ జియో చందాదారులకు మరో శుభవార్తను అందించనుంది .మార్చి 31వ, తేదివరకు ఉచిత డేటా కాల్స్ సేవలను జియో అందిస్తోంది. అయితే రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబర్ షిప్ పొందడం ద్వారా ఏప్రిల్ 1వ, తేది నుండి ఈ సేవలను ఉచితంగానే పొందే అవకాశం ఉంది.అయితే ఉచిత గడువు ఆఫర్ ను మరో నెల రోజుల పాటు పొడిగించే అవకాశం ఉందని సమాచారం.

రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకొన్నవారు 84 శాతం మంది

రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకొన్నవారు 84 శాతం మంది

రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్ షిప్ ను ఇప్పటికే 84 శాతం మంది తీసుకొన్నారని ఓ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ తాను నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టుగా ప్రకటించింది. ఇదే సమయంలో రిలయన్స్ జియో సంస్థ ప్రైమ్ ఆఫర్ గడువును ఏప్రిల్ 30వరకు పొడిగించే అవకాశాలున్నట్టుగా టెలీ అనాలసిస్ అనే సంస్థ పేర్కొంది. అయితే దీనిపై రిలయన్స్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రైమ్ చందదారుల ద్వారా జియో 50 శాతం లక్ష్యాన్ని చేరుకొంది.

English summary
Reliance Jio users will be aware that the Jio Happy New Year Offer will be ending on March 31, after which customers will have to start paying for data and bundled services. To ease customers into this, Reliance Jio launched the Jio Prime Offer that requires Rs. 99 to subscribe and continue to enjoy services at a discounted prime. The Jio Prime offer is supposed to end on March 31, but according to a new report, Jio might just extend the Prime deadline a bit further.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X