వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిషేధించలేం కానీ: కోమట్లు పుస్తకంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు, కంచ ఐలయ్యకు ఊరట, స్పందన

తెలుగు రాష్ట్రాలలో తీవ్ర దుమారం రేపిన వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య పుస్తకం సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలలో తీవ్ర దుమారం రేపిన వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య పుస్తకం సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

బాధపడుతున్నారుగా: ఐలయ్య పుస్తకంపై జేపీ, 'ఆ కుట్రలో భాగంగానే పుస్తకాలు' బాధపడుతున్నారుగా: ఐలయ్య పుస్తకంపై జేపీ, 'ఆ కుట్రలో భాగంగానే పుస్తకాలు'

కులాన్ని అవమానించారంటూ

కులాన్ని అవమానించారంటూ

తమ కులాన్ని అవమానించేలా రాసిన ఈ పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలని ఆర్య వైశ్య సంఘం నేత, ప్రముఖ న్యాయవాది రామాంజనేయులు గత నెలలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Recommended Video

Kancha Ilaiah vs Arya Vysya community దానికి సిద్దమా?, పేరు మారుస్తా..ఐలయ్య సవాల్!| Oneindia Telugu
 ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు

ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు దానిపై విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 పుస్తకాన్ని నిషేధించలేం, కానీ రచయితలు స్వీయనియంత్రణ

పుస్తకాన్ని నిషేధించలేం, కానీ రచయితలు స్వీయనియంత్రణ

ఈ పుస్తకాన్ని తాము నిషిధించలేమని, అలా చేస్తే భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లు అవుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే రచయితలు స్వీయనియంత్రణ పాటించాల్సిందేనని కంచ ఐలయ్య వంటి రచయితలకు హితవు పలికారు. అయితే వివాదాస్పదమైన కారణంగా పుస్తకాన్ని రద్దు చేయాలని ఆదేశించలేమని చెప్పారు.

 స్వాగతించిన ఐలయ్య

స్వాగతించిన ఐలయ్య

పుస్తకాన్ని నిషేధించలేమంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కంచ ఐలయ్య స్వాగతించారు. తమపై ఒక పుస్తకం వచ్చినందుకు కోమట్లు గర్వించాలని, పుస్తకాలు నిషేధిస్తే భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లు అవుతుందని తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడారు.

English summary
Relief to controversial writer Kancha Ilaiah in Supreme Court on his book samajika smugglurlu komatollu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X