వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిరీష కేసులో వారికి రిమాండ్: ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యలో కొత్త కోణాలు

సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష హత్య కేసులో నిందితులు శ్రవణ్, రాజీవ్‌లను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష హత్య కేసులో నిందితులు శ్రవణ్, రాజీవ్‌లను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

<strong>రాజీవ్-శ్రవణ్‌ల తీరు: పోలీసుల విస్మయం, శిరీష-తేజస్వినిలను అలా వదిలించుకోవాలని.. </strong>రాజీవ్-శ్రవణ్‌ల తీరు: పోలీసుల విస్మయం, శిరీష-తేజస్వినిలను అలా వదిలించుకోవాలని..

శిరీష మృతికి, కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి మృతికి సంబంధముందనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త కోణం వినిపిస్తోంది. తాజాగా ఆయన ప్రయివేటు సెటిల్మెంట్స్ చేశారని, అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

డిజి కుమార్తెను వేధించినట్లుగా..

డిజి కుమార్తెను వేధించినట్లుగా..

ప్రభాకర్ రెడ్డి పలు ప్రయివేటు సెటిల్‌మెంట్స్ చేశారని, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాడని గతంలోనూ ఆరోపణలు వచ్చాయని అంటున్నారు. ఇప్పుడిప్పుడే మరికొందరు బాధితులు ముందుకు వస్తున్నారని చెబుతున్నారు. ఉమ్మడి ఏపీలో డీజీగా పని చేసిన కోటేశ్వరరావు కుమార్తె శ్వేతను ఓ సెటిల్‌మెంట్ వ్యవహారంలో ప్రభాకర్ రెడ్డి బెదిరించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

అలా ఎస్సై సాయం

అలా ఎస్సై సాయం

రిటైర్డ్ ఐజీ కోటేశ్వరరావుకు బంజారాహిల్స్‌లో ఓ భవనం ఉంది. దాన్ని ముగ్గురు యువకులకు అద్దెకు ఇచ్చారు. కాఫీ షాపు పెడతామని అద్దెకు తీసుకున్న ఆ యువకులు దాన్ని హుక్కా సెంటర్‌గా మార్చేశారు. దీనిపై శ్వేత నిలదీయడంతో ఆ యువకులు ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి సాయం తీసుకున్నారు.

తండ్రితో ఫోన్ చేయించారు

తండ్రితో ఫోన్ చేయించారు

భవనం దగ్గరకు వచ్చిన ఎస్సై.. శ్వేతను బెదిరించారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఎస్సై తీరు సరిగ్గా లేకపోవడంతో శ్వేత అక్కడి నుంచి వెళ్లిపోయి తన తండ్రితో ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేయించింది.

రిటైర్డ్ డిజిని అని చెప్పినా..

రిటైర్డ్ డిజిని అని చెప్పినా..

తాను రిటైర్డ్ డీజీనని చెప్పినా ప్రభాకర్ రెడ్డి వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడా వారికి న్యాయం జరగలేదు. శిరీష ఆత్మహత్య తర్వాత ప్రభాకర్ రెడ్డి బాగోతం బయటకు రావడంతో తాము ధైర్యం చేసి బెదరింపు విషయాన్ని బయట పెట్టామని శ్వేత ఓ టీవీ ఛానల్‌తో తెలిపారు.

English summary
Remand to Rajeev and Sravan in beautician Sirisha's case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X