వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్త‌మ్ వైఖ‌రిలో మార్పు..!! ఆ నాయ‌కుడికి ఫోన్ చేసింది అందుకేనా..??

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వైఖ‌రిలో అక‌స్మాత్తుగా మార్పు వ‌చ్చింది. ఇన్నాళ్లూ దూరం పెట్టిన నాయ‌కులకు ఉత్తమ్ కాలింగ్ అంటూ ఫోన్లు మోగ‌టంతో అవాక్క‌యిపోతున్నారు స‌ద‌రు నాయ‌కులు. ఇంట్లో చ‌దువుకోకుండా అల్ల‌రి చేస్తున్న పెద్దోడి వీపులో ఒక్క‌టేస్తే రెండో వాడు అల్ల‌రంటే తెలియ‌నంత విన‌యంతో ఆటోమేటిగ్గా పుస్త‌కాలు తెరుస్తాడు. ఇది స‌హ‌జంగా ప్ర‌తి ఇంట్లో జ‌రిగే ప‌నే. ఇప్పుడు తెలంగాణ పీసిసి చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆ రెండో వాడిని మ‌రిపిస్తున్నారు.

 కీల‌క నేత‌ల‌కు ఉత్త‌మ్ ఫోన్.. దానం అంశం పున‌రావ్రుత్తం కాకుండా జాగ్ర‌త్త‌లు..

కీల‌క నేత‌ల‌కు ఉత్త‌మ్ ఫోన్.. దానం అంశం పున‌రావ్రుత్తం కాకుండా జాగ్ర‌త్త‌లు..

మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏంజ‌రిగినా డోంట్ కేర్ అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన ఉత్త‌మ్., నిన్న న‌గ‌రానికి చెందిన ప్ర‌ముఖ నాయ‌కుడు దానం నాగేంద‌ర్ పార్టీ కి గుడ్ బై చెప్ప‌డంతో ఖంగుతిన్నారు. స‌ద‌రు నేత‌తో ఒంట‌రిగా, ఏకాంతంగా, ర‌హ‌స్యంగా స‌మావేశం నిర్వ‌హించి నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేసినా ఉత్త‌మ్ మాట బేఖాత‌రు చేస్తూ కాళ్ల‌కి స్కేటింగ్ షూ క‌ట్టుకుని ప‌రుగెత్తినంత వేగంగా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయారు. ఈ ప‌రిణామంతో పీసిసి చీఫ్ కు అలుముకున్న మేఘాలు ఒక్క‌సారిగా ప‌టాపంచ‌లు అయ్యాయి. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే అస‌లుకే మోసం వ‌స్తుంద‌ని భావించిన ఉత్త‌మ్ తాను స్వ‌యంగా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన నాయుకుల‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

దానం నిర్ణ‌యంతో ఖంగుతిన్న ఉత్త‌మ్.. పార్టీ బ‌లోపేతం దిశ‌గా అడుగులు..

దానం నిర్ణ‌యంతో ఖంగుతిన్న ఉత్త‌మ్.. పార్టీ బ‌లోపేతం దిశ‌గా అడుగులు..

న‌గ‌రానికి చెందిన కాంగ్రేస్ పార్టీ సీనియ‌ర్ నేత దానం నాగేంద‌ర్ నిష్క్ర్ర‌మ‌న‌తో ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి జ్ఞానోద‌యం అయింద‌ని పార్టీలో చ‌ర్చించుకుంటున్నారు. ఇంత కాలం ఆదిప‌త్యం ఇగోతో అన‌వ‌స‌రంగా అట‌క‌మీద ఉంచిన ఉంచిన నాయ‌కుల ప‌ట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రించి మ‌చ్చిక‌చేసుకునే దిశ‌గా ఉత్త‌మ్ అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. స్వ‌ల్ప అపోహ‌ల‌తో పార్టీ కి దూరం పెట్టిన నాయ‌కుల‌ను మ‌ళ్లీ ఫ్రెష్ గా త‌న‌తో క‌లుపుకుపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. తాను ఇంత‌కాలం అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించి త‌గినంత ప్ర‌ధాన్య‌త ఇవ్వ‌ని నాయ‌కుల‌ను ఇక మీద‌ట గౌర‌వించి స‌ముచిత స్థానం క‌లిగించాల‌ని భావిస్తున్నారు. ఆదిప‌త్య క్రీడ పేరుతో నాయ‌కుల‌ను ప‌క్కన పెడితే ఏ ప‌రిణామాల‌కు దారి తీస్తుందో అనే సందిగ్దంలో అందిరితో అణుకువ‌గా వ్య‌వ‌రిస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని ఉత్త‌మ్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు కూడా తెలుస్తోంది. సాధార‌ణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో అంద‌రిమ‌ద్య ఐక్య‌తా రాగం పాడించాల‌ని ఉత్త‌మ్ ప్ర‌ణాళి రిచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అదిష్టానం మంద‌లింపుతో మేల్కొన్న ఉత్త‌మ్..

అదిష్టానం మంద‌లింపుతో మేల్కొన్న ఉత్త‌మ్..

దానం విష‌యంలో అదిస్టానం నుండి కూడా ఉత్త‌మ్ కి గ‌ట్టి మంద‌లింపు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఉత్త‌మ్ కూగా తొంద‌ర‌గా మేల్కొన్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ పీసిసి చీఫ్ గా పార్టీ నాయ‌కుల‌తో పాటు క్య‌డ‌ర్ ను ఏక‌తాటిపై న‌డిపించ‌డంలో త‌న లోపం ఉండ‌కూడ‌ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. అందులో భాగంగానే ఇంత‌కాలం పార్టీ కార్య‌క్ర‌మాల్లో అంత‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌ని రేవంత్ రెడ్డి లాంటి చురుకైన నాయ‌కుడిని పార్టీ ప‌రంగా మ‌ళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌భుత్వ విధానాల‌పై ఉత్త‌మ్ చేస్తున్న పోరాటం గాని, విమ‌ర్శ‌లు గాని అంత‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం లేద‌నే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ఉత్త‌మ్ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు.. రంగంలోకి రేవంత్ రెడ్డి..

ఉత్త‌మ్ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు.. రంగంలోకి రేవంత్ రెడ్డి..

అదే స్థానంలో కేసీఆర్ కి ధీటుగా స‌మాధానం చెప్పే నేత ఎరంటే రేవంత్ రెడ్డి పేరునే ప్ర‌ధానంగా చెప్పుకొస్తున్నారు పార్టీ శ్రేణులు. ఇలాంటి నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి లాంటి నేత‌ను పార్టీ ప‌టిష్ట‌త‌కోసం వినియోగించుకోవాల‌ని పీసిసి స‌మాలోచ‌ల‌న‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. రేవంత్ లాంటి నేత పార్టీలో క్రియాశీలకంగా ఉంటే క్య‌డ‌ర్ తో పాటు నేత‌ల‌కు కూడా భ‌రోసా ఉంటుంద‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. దాంట్లో భాగంగానే దానం దారిలో మ‌రో నేత న‌డ‌వ‌కుండా ఉండేందుకు రేవంత్ ను రంగంలోకి దింపాల‌ని పిసీసీ భావిస్తోంది. అందుకోసం పీసిసి చీప్ రేవంత్ రెడ్డికి కాల్ చేసిన‌ట్టు తెలుస్తోంది.చాలా కాలం త‌ర్వాత ఉత్త‌మ్ నుండి వ‌చ్చిన ఫోన్ కాల్ కు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లో ఉత్త‌మ్, రేవంత్ రెడ్డిల భేటీ కాబోతున్నారు కూడా. రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ త‌రుపున స‌రైన స్వేచ్చ ఇస్తే పార్టీ ప‌ట్టాలెక్కి ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని కార్య‌క‌ర్త‌లు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
telangana pcc chief uttam kumar reddy suddenly changed his attitude. he wants to go ahead with all leaders. in that regard he called revanth reddy and both are going to conduct a meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X