హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేబీఆర్ పార్కు పేరు మార్చండి: ప్రిన్స్ ముకరంజాగా పెట్టాలని కేసీఆర్‌కు వినతి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని జూబ్లిహిల్స్‌లో ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబీఆర్) పార్కు పేరును మార్చాలనే అనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. తాజాగా కేబీఆర్ పార్కుకు ప్రిన్స్ ముకరంజా పేరు పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ అబీద్ రసూల్‌ఖాన్ కోరారు.

ఈ సందర్భంగా ఈ విష‌య‌మై శుక్రవారం హైద‌రాబాద్‌లో కేసీఆర్‌ని అబీద్ రసూల్‌ఖాన్ క‌లిశారు. గ‌తంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రిన్స్ ముకరంజా నుంచి 400 ఎకరాల స్థలాన్ని అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద తీసుకుంద‌ని ఆయ‌న కేసీఆర్‌తో ప్రస్తావించారు.

ఆ తర్వాత ప్రిన్స్ ముకరంజా నుంచి తీసుకున్న భూమిని సీలింగ్‌లో లేద‌ని పేర్కొని మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబీఆర్) నేష‌నల్ పార్కుగా ప్ర‌క‌టించార‌ని అబీద్ రసూల్‌ఖాన్ చెప్పారు. గతంలో కూడా కేబీర్ఆర్ పార్కు పేరు మార్చాలని ఎనిమిదో నిజాం మాజీ భార్య ఇస్రా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 2014లో లెటర్ రాశారు.

Rename KBR Park after Mukarram Jah: Former wife of the eighth Nizam

నిజాం రాజైన అజమ్ ఝా తన కుమారుడు ప్రిన్స్ ముకరంజాకు 400 ఎకరాల భూమిని ఇచ్చాడని, దాని అసలు పేరు చిరాన్ ప్యాలెస్‌గా ఆమె అందులో పేర్కొన్నారు. హైదరాబాద్ ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్‌గా ముకరంజా ప్రజారంజక పాలనను అందించాడని ఆమె తెలిపారు.

1956 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన చారిత్రక కట్టడాలన్నీ కూడా నిజాం నవాబుల పరిపాలనలోనే జరగడం విశేషం. దీంతో ఇప్పుడు తాజాగా తెలంగాణలో చారిత్ర కట్టడాలకు నిజాం నవాబుల పేరు పెట్టాలంటూ రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ అబీద్ రసూల్‌ఖాన్ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం కేబీఆర్ పార్కు ఉన్న స్ధలం అంటే ప్రిన్స్ ముకరంజాకు ఎంతో ఇష్టమని ఇస్రా తెలిపారు. దీనిని వ్యవసాయం, పోలో, వింటేజ్ కార్ల ప్రదర్శనకు ఈ స్థలాన్ని వినియోగించేవారు. అయితే హైదరాబాద్ సంస్ధానాన్ని భారత ప్రభుత్వంలోకి విలీనం చేసిన తర్వాత చిరాన్ ప్యాలెస్‌గా భావించే ఈ 400 ఎకరాల్లో కేవలం 6 ఎకరాలు మాత్రమే ప్రిన్స్‌కు కేటాయించారు.

English summary
The former wife of the eighth Nizam, Esra will soon call on chief minister K Chandrasekhar Rao to urge him to rename Kasu Brahmananda Reddy National Park in Jubilee Hills after former prince Mukarram Jah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X