వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ ఫలితాలు: 'టీవీ ఛానల్స్‌పై ఒత్తిడి తెలుసు కానీ, అలా చేయొద్దు'

ఎగ్జిట్ పోల్స్ పేరుతో వరుస కథనాలను టీవీ ఛానల్స్ ప్రసారం చేయడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి శుక్రవారం మండిపడ్డారు. యూపీలో బీజేపీ గెలుస్తుందని చెప్పడంపై ఆమె స్పందించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ పేరుతో వరుస కథనాలను టీవీ ఛానల్స్ ప్రసారం చేయడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి శుక్రవారం మండిపడ్డారు. యూపీలో బీజేపీ గెలుస్తుందని చెప్పడంపై ఆమె స్పందించారు.

ఎగ్జిట్ పోల్స్‌ పేరుతో వదంతులు ప్రచారం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయని పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు సంధించాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండటాన్ని పలు పార్టీలు తప్పుపడుతున్నాయి. ఫలితంపై శనివారమే స్పష్టత వస్తుందంటున్నారు.

<strong>మోడీ హవా, అఖిలేష్‌కు 'రాహుల్' దెబ్బ: మాయావతి 'కీ' రోల్?</strong>మోడీ హవా, అఖిలేష్‌కు 'రాహుల్' దెబ్బ: మాయావతి 'కీ' రోల్?

రేణుకా చౌదరి కూడా స్పందించారు. వాస్తవ అంశాలపై దృష్టి సారించడానికి బదులు వదంతులు, అబద్ధాలను గుదిగుచ్చి ప్రసారం చేయడమేమిటని నిలదీశారు. టీవీ ఛానెల్స్‌పై వచ్చే ఒత్తిడి తాను అర్థం చేసుకోగలనని, జాతీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశాలపై ఆ ఛానెల్స్ దృష్టి పెట్టడం లేదని వ్యాఖ్యానించారు.

 Renuka Choudhary responds on exit poll

ఎగ్జిట్ పోల్స్ వరుస ప్రసారాలు, పేనలిస్టులతో ఊదరగొట్టే చర్చలు వంటివి ప్రజాస్వామ్య దేశంలోని ప్రజల తెలివితేటలను కించపరచడం కిందే లెక్క అన్నారు. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షమైన ఎస్పీ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసింది.

పూర్తి మెజారిటీతో అఖిలేష్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆ పార్టీ నేత రవిదాస్ మెహ్రోత్రా అన్నారు. అనేక సార్లు ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువయ్యాయని, ఈసారి ఎగ్జిట్ పోల్స్ కూడా అంతేనన్నారు.

<strong>బీజేపీకి షాక్, మాయావతితో సిద్ధం: అఖిలేష్ షాకింగ్ ప్రకటన</strong>బీజేపీకి షాక్, మాయావతితో సిద్ధం: అఖిలేష్ షాకింగ్ ప్రకటన

అసలు ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయత ఎప్పుడూ ప్రశ్నార్థకమేనని సీపీఐ-ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. గతంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆ తర్వాత తారుమారైన సందర్భాలు చాలానే ఉన్నాయన్నారు. మరో 24 గంటలు ఆగితే ఆ విషయం ఏమిటో తేలిపోతుందన్నారు.

English summary
Congress Party leader Renuka Choudhary on Friday responded on Uttar Pradesh, Uttarakhan, Manipur, Goa exit poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X