వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఎన్నికల్లో రేణుకా చౌదరి విజయం .. విజయోత్సాహంలో కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

లోక్ సభ ఎన్నికలలో హోరా హోరీగా టీఆర్ఎస్ తో తలపడిన కాంగ్రెస్ నుండి ఖమ్మం లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన రేణుకా చౌదరి మరో ఎన్నికల్లో విజయం సాధించింది. మాజీ ఎంపీ రేణుకా చౌదరి హోరాహోరీగా సాగిన హెచ్‌ఎంటీ కంపెనీ వర్కర్స్‌ అండ్‌ స్టాఫ్‌ యూనియన్‌ ఎన్నికల్లో విజయం సాధించారు. శనివారం జరిగిన ఈఎన్నికల్లో హెచ్‌ఎంటీ మెషిన్‌ టూల్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ తరపున రేణుకా చౌదరి బరిలోకి దిగారు .హెచ్‌ఎంటీ వర్కర్స్‌ అండ్‌ స్టాఫ్‌ యూనియన్‌ తరపున పోటీలో నిలిచిన కేపీ. వివేకానంద్‌ రేణుక పై పోటీలో నిలిఛి గెలిచారు .

151 మంది ఓటర్లకు గాను 144 మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినయోగించుకున్నారు. హెచ్‌ఎంటీ కంపెనీ ఎన్నికల బరిలోకి దిగిన రేణుకా చౌదరికి 79 ఓట్లు వచ్చాయి. వివేకానందకు 65 ఓట్లు వచ్చాయి. 14 ఓట్ల తేడాతో కేపీ వివేకానంద్‌ ఓటమి పాలయ్యారు. రేణుకా చౌదరి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రేణుకా చౌదరికి మద్దతుగా నిలిచిన మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్‌ రేణుకా చౌదరి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు .ఈ విజయాన్ని చేకూర్చడంలో భాగస్వాములైన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.

రేణుకా చౌదరికి పువ్వాడ సవాల్ .. ఒక్క దొంగ ఓటు నిరూపించినా రాజీనామా చేస్తారేణుకా చౌదరికి పువ్వాడ సవాల్ .. ఒక్క దొంగ ఓటు నిరూపించినా రాజీనామా చేస్తా

Renuka Chowdarys victory in the election .. congress in victory mood

కుత్బుల్లాపూర్‌ కూడలిలోని డా.బీఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహానికి కార్మికులతో కలిసి వెళ్లి ఆయన పూలమాల వేశారు. కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సమస్యలను పరిష్కరిస్తామని కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు . ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 2007 వేతన ఒప్పందాన్ని, కార్మికుల వయో పరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు సవరించేలా కృషి చేస్తామని కూన శ్రీశైలం గౌడ్ హామీ ఇచ్చారు.

English summary
Former MP Renuka Chowdhury won the HMT company Workers and Staff Union Elections, which went on prestigious. On Saturday, Renuka Chowdhury contested from the HMT machine tools employeees Union, on KP. Vivekananda who is contesting from the HMT Workers and Staff Union. Renuka won in the election with 14 votes .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X