ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్ద హీరోల సినిమాలే బోల్తా: కెసిఆర్‌పై రేణుకా చౌదరి సెటైర్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

ఖమ్మం/ వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పెద్ద హీరోల సినిమాలే బాక్సాఫీసు దగ్గర బోల్తా పడుతున్నాయని, కేసీఆర్‌ ముఖం ప్రజలు ఎంతకాలం చూస్తారని అన్నారు.

కాంగ్రెస్‌లో పంచపాండవులు ఉన్నారని. కెసిఆర్ పంచన కౌరవులు మాత్రమే చేరారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అంతిమ విజయం కాంగ్రెస్‌దేనని ఆమె శుక్రవారంనాడు ఖమ్మం జిల్లాలో అన్నారు.

Renuka Chowdary satires on Telangana CM KCR

ఇదిలావుంటే, రాష్ట్రంలో తెరాస రెండేళ్ల పాలన మొత్తం అవినీతిమయంగా మారిందని తెలంగాణ పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. వ్యవసాయశాఖ ద్వారా రైతులకు రాయితీపై ఇచ్చే ట్రాక్టర్ల పంపిణీ మొత్తం అవినీతిమయంగా మారిందని విమర్శించారు.

వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రైతులకు అండగా నిలవడంలో కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వ్యవసాయాన్ని కాపాడటానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలేవీ రైతులకు మేలు జరిపించడం లేదని విమర్శించారు.

English summary
Congress leader Renuka Chowdary made satirical comments against Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X