వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా సచివాలయం పాత భవనంతో ప్రమాదం .. నిపుణుల కమిటీ తేల్చిందిదే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ పాత సచివాలయం ప్రమాదకరంగా వుందని నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను కేబినెట్ సబ్ కమిటీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేసింది. ఆగస్ట్ 28న నిపుణుల కమిటీ ఒక నివేదికను తయారు చేసి కేబినెట్ సబ్ కమిటీ కి ఆ రిపోర్టు ను అందించింది. రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించిన కేబినెట్ సబ్ కమిటీ.. తమ రిపోర్టును ముఖ్యమంత్రికి అందించింది.
పాత సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణం అవసరం లేదంటూ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో, ఇక తెలంగాణ హైకోర్టు కూడా పాత సచివాలయాన్ని కూల్చి వేయాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సచివాలయ నిర్మాణంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

తెలంగాణ సచివాలయ నిర్మాణంపై నలుగురు చీఫ్ ఇంజనీర్ లతో నిపుణుల కమిటీ నివేదిక

తెలంగాణ సచివాలయ నిర్మాణంపై నలుగురు చీఫ్ ఇంజనీర్ లతో నిపుణుల కమిటీ నివేదిక

తెలంగాణ సచివాలయ నిర్మాణంపై నలుగురు చీఫ్ ఇంజనీర్ లతో కూడిన నిపుణుల కమిటీ బుధవారం నాడు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి నివేదికను అందించింది.ఈ కమిటీ నివేదిక మేరకు సచివాలయ నిర్మాణం పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కొత్త సచివాలయం పై కేబినెట్ సబ్ కమిటీని కూడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే నిపుణుల కమిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేబినెట్ సబ్ కమిటీ నిపుణుల కమిటీ నిర్ణయం మేరకు కొత్త సచివాలయం నిర్మాణాన్ని ప్రతిపాదిస్తూ సీఎం కేసీఆర్ కు నివేదికను అందించింది.

భద్రత లేదు, ప్రమాదకరం గా ఉందని రిపోర్ట్ ఇచ్చిన నిపుణుల కమిటీ

భద్రత లేదు, ప్రమాదకరం గా ఉందని రిపోర్ట్ ఇచ్చిన నిపుణుల కమిటీ

ఇక నిపుణుల కమిటీ నివేదికలో ఏముందంటే ప్రస్తుతమున్న సచివాలయంలో మార్పులు చేర్పులు చేయడానికి వీలు కాదు. ప్రస్తుత సచివాలయ భవనం ప్రమాదంలో ఉంది. సచివాలయ భవనం లో ఫైర్ సేఫ్టీ కానీ, ఎన్ బీసి గాని, ఐజీబీసీ నిబంధనలకు అనుగుణంగా కానీ లేవు. అనువైన వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. పార్కింగ్ స్థలం, భద్రత లేకుండా సచివాలయ ప్రాంగణం ఉందని నిపుణుల కమిటీ పేర్కొంది. భవనాలు ఇరుకుగా ఉండడంతో, ప్రమాదాలకు ఆస్కారం ఉందని, ప్రస్తుత సెక్రటేరియట్ సురక్షితం కాదని అభిప్రాయాన్ని నిపుణుల కమిటీ పేర్కొంది. అందుకే అద్భుతమైన సచివాలయ కాంప్లెక్స్‌ను నిర్మించాలని , తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని తెలియజేసేలా , మెరుగైన వసతులతో, అధునాతన భవనాన్ని నిర్మించాలని నిపుణుల కమిటీ సూచించింది.

ప్రతిపక్షాల నోటికి తాళం వేసేలా .. హైకోర్టుకు సమాధానం చెప్పేలా నివేదిక

ప్రతిపక్షాల నోటికి తాళం వేసేలా .. హైకోర్టుకు సమాధానం చెప్పేలా నివేదిక

ఇక నిపుణుల కమిటీ రిపోర్టును ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు వి.శ్రీనివాస్ గౌడ్, వి. ప్రశాంత్ రెడ్డికి అందించారు. మంత్రుల సబ్ కమిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి, ఫైనల్ రిపోర్టును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించారు. దీంతో కొత్త భవన నిర్మాణానికి నిపుణుల కమిటీ చేసిన సూచనలు కారణమని , పాత భవనం సురక్షితం కాదని కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను అటు కోర్టుకు నివేదించనున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీల నోటికి తాళం పడేలా కమిటీ నివేదిక ప్రతిపాదనను ముందు పెట్టనున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ తాను అనుకున్నది సాధించడం కోసం, తెలంగాణ సెక్రటేరియట్ కొత్త భవన నిర్మాణం కోసం శ్రీకారం చుట్టిన నేపద్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కెసిఆర్ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తమ నివేదికను అందించటం గమనార్హం.

English summary
The Cabinet Sub-Committee has submitted to the Telangana Chief Minister KCR the report of the Expert Committee that the old Secretariat of Telangana is in dangerous. On August 28, the Expert Committee prepared a report and presented the report to the Cabinet Sub-Committee. The Cabinet Sub-Committee which examined the report thoroughly presented their report to the Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X