వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్! మరో పాకిస్థాన్‌గా మార్చేస్తారా?: వెంకయ్య ఆగ్రహం

వెనుకబాటుతనం ఆధారంగా, ఏదైనా మతంలో సాంఘిక వివక్ష కారణంగా రిజర్వేషన్లు కల్పిస్తే వాటికి భారతీయ జనతా పార్టీ నుకూలంగా ఉంటుందని, మతం ఆధారంగా కల్పిస్తే వ్యతిరేకిస్తుందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్ట

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వెనుకబాటుతనం ఆధారంగా, ఏదైనా మతంలో సాంఘిక వివక్ష కారణంగా రిజర్వేషన్లు కల్పిస్తే వాటికి భారతీయ జనతా పార్టీ నుకూలంగా ఉంటుందని, మతం ఆధారంగా కల్పిస్తే వ్యతిరేకిస్తుందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

మతపరమైన రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని, అవి ఏ న్యాయస్థానం ముందూ నిలవబోవనిపేర్కొన్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌ 126వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకయ్య మాట్లాడారు.

మరో పాకిస్థాన్..

మరో పాకిస్థాన్..

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు మరో పాకిస్థాన్ రూపకల్పనకు దారి తీస్తాయని వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వెనకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించే విషయంలో మాత్రం తాము అనుకూలమని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లు సామాజిక అశాంతికి దారితీస్తాయని, వివిధ వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడుతుందని అన్నారు. ఈ తరహా రిజర్వేషన్లను రాజ్యాంగం ఒప్పుకోదని చెప్పారు.

తీవ్ర స్పందన

తీవ్ర స్పందన

సామాజిక అసమానతలను, కులవివక్షను అంతమొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు పెంచాలని తీసుకున్న నిర్ణయంపై వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. స్వాతంత్య్రం ముందు, అనంతరం దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సమన్యాయం తీసుకురావడానికి, సామాజిక వివక్షను రూపుమాపడానికి అంబేద్కర్ కృషి చేశారని పేర్కొన్నారు.

కేసీఆర్ అనే కాదు..

కేసీఆర్ అనే కాదు..

‘కేసీఆర్‌ ఇస్తున్నారని వ్యతిరేకించడం లేదు. వైయస్‌, చంద్రబాబు ప్రయత్నించినప్పుడూ వ్యతిరేకించాం. బీజేపీ జాతీయ విధానమిది. మతపరమైన రిజర్వేషన్లు మరో పాకిస్తాన్‌ రూపకల్పనకు దారితీస్తాయి' అని వెంకయ్య పునరుద్ఘాటించారు.

భీమా ఆధార్

భీమా ఆధార్

ప్రధాని నరేంద్ర మోడీ ‘బీమ్-ఆధార్' పథకాన్ని ప్రారంభించారని, ప్రతి కార్యకర్త కనీసం ఇద్దరిని గుర్తించి బీమ్ యాప్‌ను వినియోగించడం నేర్పించాలని వెంకయ్యనాయుడు హితవు చెప్పారు. నాగ్‌పూర్‌లో 9.41 కోట్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్షా భూమిని నిర్మిస్తున్నారని, అంబేద్కర్ చివరి రోజుల్లో న్యూఢిల్లీలో నివసించిన గృహాన్ని 1.84 ఎకరాల్లో విస్తరించి వందకోట్లతో స్మారక కేంద్రాన్ని కేంద్రం నిర్మిస్తోందని, 15 జనపథ్‌లో అంబేద్కర్ కనె్వన్షన్ సెంటర్‌ను కూడా నెలకొల్పుతోందని వెంకయ్య వెల్లడించారు.

మతం మారిన వారికి రిజర్వేషన్లా?

మతం మారిన వారికి రిజర్వేషన్లా?

అంబేడ్కర్‌ ఆలోచనల్ని కాంగ్రెస్‌ ఏనాడూ గుర్తించలేదని వెంకయ్య దుయ్యబట్టారు. ‘గాంధీ పట్టుదలతోనే అంబేద్కర్ స్వాతంత్య్రానంతర తొలిప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖమంత్రి అయ్యారు. 1990ల్లో కానీ భారతరత్న ఇవ్వలేదు. అదీ మేం మద్దతిచ్చిన వీపీ సింగ్‌ ప్రభుత్వంలో వచ్చింది' అని వెంకయ్య నిప్పులు చెరిగారు.
‘అందరికీ న్యాయం అన్న అంబేడ్కర్‌ సూత్రాన్ని మోడీ పాటించగలరన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఆయన వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నాన్ని ప్రధాని చేస్తున్నారు. ముస్లింలలో, క్రైస్తవులలోనూ కులవివక్ష ఉంది. మతం మారినవారు కూడా రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు' అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

English summary
Union minister Venkaiah Naidu today said implementation of reservations on the basis of religion may result in social unrest in the country and "lead to creation of another Pakistan". Speaking at a BJP meeting organised on the occasion of the Ambedkar Jayanthi, Mr Naidu also hinted that Telangana's recent proposal to hike reservations for certain sections may not be constitutionally valid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X