వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13 కార్పోరేషన్లు..123 మున్సిపాల్టీలు: రిజర్వేషన్లు ఖరారు: జనరల్ కోటాలో గ్రేటర్..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోని కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యారు. 13 నగరపాలక సంస్థల్లో ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బీసీలకు 4, జనరల్‌కు 7 స్థానాలు కేటాయించారు. 123 మున్సిపల్‌ ఛైర్మన్లలో ఎస్టీలకు 4, ఎస్సీలకు 17, బీసీలకు 40, జనరల్‌కు 62 స్థానాలు కేటాయించారు. రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను పురపాలక శాఖ ప్రకటించింది. మీర్‌పేట్‌ మేయర్‌ పదవి ఎస్టీకి కేటా యించగా, రామగుండం మేయర్‌ పదవి ఎస్సీకి కేటాయించారు. జవహర్‌నగర్‌, బండ్లగూడ, నిజామాబాద్‌ నగరపాలక సంస్థ మేయర్‌ పదవులను బీసీకి కేటాయించారు.

128 మున్సిపాలిటీలో జడ్చర్ల, నకిరేకల్ ఇంకా సమయం ఉందని, వివిధ కారణాలతో పాల్వంచ, మందమర్రి, మణుగూరుకు రిజర్వేషన్ ప్రకటించడం లేదని అధికారులు ప్రకటించారు. 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించారు. కొత్త చట్టం ప్రకారం ఇవే రిజర్వేషన్లు తరువాత ఎన్నికల్లో కూడా వర్తిస్తాయనని అధికారులు స్పష్టం చేసారు.

Reservations finalised for municipal corporations and municipalities in Telangana

జనరల్ కోటాలో గ్రేటర్ హైదరాబాద్..

మహానగర మేయర్‌ జనరల్ కోటాలో ఖరారైంది. జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీ కాలం ఫిబ్రవరి 10, 2021 వరకు ఉంది. మరో యేడాది వరకు నగరంలో ఎన్నికలు లేవు. అయినా, పుర ఎన్నికల దృష్ట్యా ముందే మేయర్‌ రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వాల్సి ఉండటంతో..అధికారులు ఖరారు చేసారు. ప్రస్తుత రిజర్వేషన్‌ బీసీ జనరల్‌ కాగా.. ఇప్పుడు జనరల్ కేటగిరీకి దక్కటం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు నిర్ఱ యించిన రిజర్వేషన్‌ రెండు పాలకమండలిల పదవీ కాలానికి వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఎస్టీ రిజర్వుడ్ మున్సిపాలిటీలు..
అమన్గల్, వర్ధన్నపేట, దోర్నాల్, మరిపెడ, డోర్నకల్.

ఎస్సీ రిజర్వుడు మున్సిపాలిటీలు..
కేతనపల్లి, బెల్లంపల్లి, మధిర, పరకాల, వైరా, నస్కురు, అలంపూర్, తోర్రుర్, నార్సింగి, పెద్ద అంబర్ పేట, ఐజా, పెబ్బేరు, నెరుడుచెర్ల, వడ్డేపల్లి, భూపాలపల్లి, తిరుమలగిరి

బీసీ రిజర్వుడు మున్సిపాలిటీలు..
సిరిసిల్ల, నారాయణ పేట, కోరుట్ల, చండూరు, భీంగల్, ఆందోల్, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, నిర్మల్, కిసిగి, రాయికల్, పోచంపల్లి, రమాయపేట, బోధన్, సదాశివ పేట, ఆర్ముర్, మెటపల్లి, గద్వాల్, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, సుల్తానాబాద్, నర్సంపేట, కిదంగల్, తుఫ్రాన్, ఆలేరు, భువనగిరి.

13 కార్పొరేషన్లలో రిజర్వేషన్లు
ఎస్టీ : మీర్‌పేట్
ఎస్సీ : రామగుండం
బీసీ : జవహర్ నగర్, వరంగల్, నిజామాబాద్, బండ్లగూడ
జనరల్‌ : బండాగ్ పెట్, కరీంనగర్, బొడుప్పల్, పిర్జాదిగూడ. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజాంపేట
కాగా.. మొత్తం జనాభాలో 1.9 శాతం ఎస్టీ జనాభా 3.25% రిజర్వేషన్లు ఖరారు చేయగా.. 3.6 శాతం ఎస్సీ జనాభా. 14% రిజర్వేషన్లు..అదే విధ:గా.. 32.5 శాతం బీసీ % జనాభా, 33 శాతం రిజర్వేషన్లు ఖరారు.

English summary
Telagnana govt announced reservations for municipal corporations and municipalities in the state. GHMC reservedas general category. Total 13 corporations and 123 Municipalties reservaions finalised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X