హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘అన్నా ’ అని వెంటాడి కాల్పులు: యాదగిరి హత్యాయత్నం నిందితులు(వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. ఘటన సమయంలో వెనక నుంచి వచ్చిన నిందితుడు 'అన్నా..' అని పిలిచాడు.. వెనక్కి తిరగ్గానే ఒక్కసారిగా కాల్పులకు దిగాడు.. ఛాతీలోకి బుల్లెట్ దిగింది.. బాధితుడు రక్తమోడుతూనే ప్రాణభయంతో పరుగులు పెట్టాడు.

అయినా దుండగుడు వదల్లేదు.. వెనుక నుంచే తుపాకీతో వెంటాడాడు.. పక్కనే ఉన్న ఆస్పత్రిలోకి పరుగెత్తి డాక్టర్ రూంలోకి వెళ్తే అక్కడకూ వచ్చి తుపాకీ పేల్చాడు.. అక్కడ్నుంచి తప్పించుకొని టాయిలెట్ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నా వదల్లేదు.. అక్కడికి వచ్చి డోర్ పగులగొట్టే యత్నం చేశాడు.. ఎలాగోలా తప్పించుకొని రోడ్డుపైకి వచ్చి దుండగుడి చేతిలోని తుపాకీ లాక్కొని కొంత దూరం పరుగెత్తి కిందపడిపోయాడు.. చనిపోయాడనుకొన్న నిందితుడు అక్కడ్నుంచి జారుకున్నాడు.

బోయిన్ పల్లిలో సినీఫక్కీలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో కాంగ్రెస్ నాయకుడు యాదగిరి తీవ్రగాయాలపాలయ్యాడు. కాగా, నిందితుడు, అతడికి సాయంగా వచ్చిన మరో నిందితుడు కూడా పరారయ్యారు. అయితే, ఆ తర్వాత పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిసింది. భూ వివాదం నేపథ్యంలోనే ఈ హత్యా యత్నం జరిగినట్లు తెలుస్తోంది.

రౌడీ షీటర్ బాబు

రౌడీ షీటర్ బాబు

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు యాదగిరి ఉదయం 10:25 గంటలకు తన ఇంటి నుంచి కాలినడకన బయల్దేరాడు.

యాదగిరి

యాదగిరి

10:50 గంటలకు మల్లికార్జునానగర్‌కాలనీ రోడ్డు నెంబరు3లో ఉన్న శ్రీనివాస మెటర్నిటీ నర్సింగ్‌ హోమ్‌ వద్దకు చేరుకున్నాడు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

వెనుక నుంచి రౌడీషీటర్‌ బాబు, రాజులు ‘అన్నా' అంటూ పిలిచారు. ఆయన వెనక్కి చూడగానే వారు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.

రక్తపు మరకలు

రక్తపు మరకలు

యాదగిరి ఎడమ భుజం కింది భాగం నుంచి ఓ బుల్లెట్‌ దూసుకెళ్లింది. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో యాదగిరి ఆసుపత్రి లోపలికి పరుగుతీశాడు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

కానీ, దుండగులు కాల్పులను ఆపలేదు. డాక్టర్‌ శేఖర్‌ గదిలోకి యాదగిరి దూసుకెళ్లే సమయంలో అమర్‌యాదవ్‌ అనే వ్యక్తి తన తండ్రికి వైద్యపరీక్షలు చేయిస్తున్నాడు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

ఆ పక్కనే కూర్చుని ఉన్న ఓ పాపను యాదగిరి తన ఒడిలోకి తీసుకుని... పాప ఉందని, కాల్పులు ఆపాలని కోరాడు.

ఘటనా స్థలంలో బుల్లెట్

ఘటనా స్థలంలో బుల్లెట్

రాజు కాల్పులను ఆపకపోగా రెండు రౌండ్లు కాల్చడంతో అవి గోడకు తగిలి కిందపడ్డాయి. దీంతో యాదగిరి ఆసుపత్రి వెనుక నుంచి బయటకు పరుగులు తీసి ప్రహరీని దూకేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

ఘటనా స్థలంలో బుల్లెట్

ఘటనా స్థలంలో బుల్లెట్

పక్కనే ఉన్న ద్వారంగుండా తన ఇంటివైపు పరుగులు తీశాడు. అప్పటికీ దుండగులు యాదగిరిని వెంబడించి మరోమారు కాల్పులు జరిపారు.

ఘటనా స్థలంలో రక్తపు మరకలు

ఘటనా స్థలంలో రక్తపు మరకలు

కానీ, యాదగిరి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో రాజు యాదగిరికి అతి సమీపంగా వెళ్లడంతో యాదగిరి అతని వద్దనున్న తపాంచా (పిస్తోల్‌)ను లాక్కుని వెనక్కువెళ్లాడు.

 ఘటనా స్థలంలో సీపీ

ఘటనా స్థలంలో సీపీ

తుపాకీతో సహా వచ్చిన యాదగరిని చూసిన డాక్టర్‌ శ్రీధర్‌... అతని చేతుల్లో ఉన్న తపంచాను చెత్తకుండీలో వేశారు.

ఆధారాల సేకరన

ఆధారాల సేకరన

రౌడీషీటర్‌ బాబు వెంటాడుతూ రాగా.. బాత్‌రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియ వేసుకున్నాడు.

స్వాధీనం చేసుకున్న తుపాకీ

స్వాధీనం చేసుకున్న తుపాకీ

బాబు బాత్‌రూం పైనుంచి మరోరౌండ్‌ కాల్పులు జరిపి, జనం వస్తారని భావించి తపంచాను అక్కడే పడేసి బయటకు వెళ్లి, బైక్‌పై పరారయ్యాడు.

ఆస్పత్రిలో..

ఆస్పత్రిలో..

అనంతరం యాదగిరి బాత్‌రూంకున్న కిటికీ అద్దాలను పగులగొడ్డి అక్కడి నుంచి బయటపడి బోయిన్‌పల్లి ఠాణాకు చేరుకున్నాడు.

కాల్పులు కలకలం

కాల్పులు కలకలం

గాయాలతో వచ్చిన యాదగిరిని చికిత్స నిమిత్తం పోలీసులు సన్‌షైన్‌ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి పరిశీలించారు. అల్వాల్‌లోని ఓ భూవివాదం వల్లే ఇదంతా జరిగిందని ఆయన చెప్పారు.

ఘటనా స్థలంలో గుమిగూడిన జనం

ఘటనా స్థలంలో గుమిగూడిన జనం

రెండు తపంచాలు, తూటాలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ సుమతి తెలిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపినా... ఒక తూటా తపంచాలోనే ఇరుక్కుపోయిందని వివరించారు. కాల్పులు జరిపిన రౌడీషీటర్‌ బాబు, రాజులు రాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల వద్ద లొంగిపోయినట్టు తెలిసింది.

English summary
A local Congress leader in Secundrabad was injured with six bullets piercing into his body in an attack witnessed by bystanders and caught on CCTV.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X