వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్జీవీని టార్గెట్ చేసిన అమృత ... ఇంత నీచానికి దిగజారావా.. రెస్ట్ ఇన్ పీస్ వర్మా అంటూ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ మర్డర్ సినిమాతో మరో వివాదానికి తెరతీశారు. రాంగోపాల్ వర్మ అమృత ప్రణయ్ ల ప్రేమ కథ, అల్లుడు ప్రణయ్ పరువు హత్య, ఆ తర్వాత మారుతీ రావు ఆత్మహత్య ఇలా జరిగిన సంఘటనలతో తెరకెక్కించబోతున్న సినిమా మర్డర్. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు రాంగోపాల్ వర్మ. జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా మర్డర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మపై అమృత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ ఫస్ట్ లుక్ చూడగానే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అంటూ ఆమె వర్మ పై నిప్పులు చెరిగారు.

Recommended Video

Amrutha Pranay's Movie మర్డర్ by RGV | ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అంటున్న Amrutha

Father's Day 2020 : నాన్నే సూపర్ హీరో.. పోస్టులు, గిఫ్టులు కాదు .. నాన్నకు కావాల్సిందిదే !!Father's Day 2020 : నాన్నే సూపర్ హీరో.. పోస్టులు, గిఫ్టులు కాదు .. నాన్నకు కావాల్సిందిదే !!

 ప్రణయ్, అమృతల ప్రేమకథ ఆధారంగా తీస్తున్న చిత్రం మర్డర్

ప్రణయ్, అమృతల ప్రేమకథ ఆధారంగా తీస్తున్న చిత్రం మర్డర్

మిర్యాలగూడ లో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ ల ప్రేమ వ్యవహారం, సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో ప్రణయ్ ను హత్య చేయించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీఅంతర్జాతీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో అమృత ప్రేమ వ్యవహారం ప్రణయ్ మర్డర్, మారుతీ రావు ఆత్మహత్యలను కథాంశంగా తీసుకుని దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం మర్డర్.

ఫాదర్స్ డే నాడు మర్డర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ

ఫాదర్స్ డే నాడు మర్డర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ

దేశంలో సంచలనం సృష్టించిన ఈ ప్రేమ విషాదాంత కథను రాంగోపాల్ వర్మ ఒక డిఫరెంట్ యాంగిల్ లో తెరకెక్కించనున్న నేపథ్యంలో నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ చూసిన మారుతీ రావు కుమార్తె ప్రణయ్ భార్య అమృత రామ్ గోపాల్ వర్మ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రేమించిన వ్యక్తిని కోల్పోయి, కన్నతండ్రికి దూరమై తీవ్ర ఆవేదనతో ఉన్నానని పేర్కొన్న అమృత దర్శకుడు రాంగోపాల్ వర్మ పోస్టర్ పై నిప్పులు చెరిగారు.

 ఆత్మహత్య చేసుకోవాలనిపించిందన్న అమృత

ఆత్మహత్య చేసుకోవాలనిపించిందన్న అమృత

ఇక ఆ ఫస్ట్ లుక్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అంటూ అమృత తన బాధను వ్యక్తం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని బాధ పడిన అమృత, తన కొడుకును చూసుకుంటూ ఇప్పుడే ప్రశాంతంగా జీవితాన్ని బ్రతకడానికి ప్రయత్నిస్తుంటే, రాంగోపాల్ వర్మ సినిమాతో ఇప్పుడు ప్రస్తుతం తన జీవితంలో కొత్త సమస్య ఎదురవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాంగోపాల్ వర్మను టార్గెట్ చేసిన అమృత తనదైన శైలిలో మండిపడ్డారు .

 సినిమా కోసం ఇంతగా దిగాజారతావా !

సినిమా కోసం ఇంతగా దిగాజారతావా !

"నేను పోస్ట్ చూసినప్పుడు, నా మనసులో మొదటి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. నా ప్రపంచం మొత్తం మళ్లీ తలక్రిందులైంది. నా మనసు ఈ బాధను భరించలేకపోయింది . నా భర్త ప్రాణయ్ హత్య జరిగిన రోజు నుండి నేటి వరకు మనసులేని ఈ సమాజానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవంతో నా జీవితాన్ని గడపడానికి చాలా కష్టపడ్డాను. వర్మా .. నువ్వు రిలీజ్ చేసిన పోస్టర్ తో నా జీవితానికి ఎటువంటి పోలికలు లేవు. సినిమా కోసం నువ్వు ఇంతగా దిగజారుతావు అనుకోలేదు . మా పేర్లను ఉపయోగించుకొని నువ్వు తప్పుడు కథను అమ్ముకోవాలి అనుకుంటున్నావు నిన్ను చూస్తే జాలేస్తుంది" అంటూ పేర్కొన్నారు. ఇక నీపై ఎలాంటి కేసులు పెట్టను అని రెస్ట్ ఇన్ పీస్" అంటూ రాంగోపాల్ వర్మపై వ్యాఖ్యానించింది అమృత.

ఏడవటానికి కూడా కన్నీళ్ళు లేవు

ఏడవటానికి కూడా కన్నీళ్ళు లేవు

ఇప్పటికే తాను సమాజంలో ఎదుర్కొన్న ఇబ్బందులతో అలసిపోయానని, ఇంకా ఇలాంటి వాటిని ఎదుర్కొనే శక్తి తనకు లేదని చెప్పింది అమృత. ప్రస్తుతం ఏడవడానికి కన్నీళ్లు కూడా రావడం లేదని పేర్కొంది. తన భర్త ప్రణయ్ మరణం నుండి ఇప్పుడిప్పుడే తన అత్త మామ కోలుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ సమయంలో ఈ సినిమా తమ జీవితంలో మరో అలజడి రేపుతుందని ఆమె పేర్కొన్నారు. తన సినిమా కోసం ప్రముఖ దర్శకుడు అయిన వర్మ ఇంతటి నీచానికి ఒడిగడతారని తను అస్సలు అనుకోలేదని అమృత వాపోయింది. ఇక అమృత వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ ఎలా స్పందిస్తాడో? ఈ సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

English summary
amrutha pranay responded on ram gopal varma's movie poster murder. As I saw the post , the first thing came into my mind is to commit suicide . My whole world turned upside down again . my heart was unable to take the pain . All these days and months from the day of the murder of my husband pranay , I struggled to live my life with self respect against the heartless society that was tearing apart my character , my life and my decision to marry a person whom I loved .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X