వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్ లే ట్విస్ట్ లు: రిటైర్డ్ డిజిపిని బెదిరించిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి

కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మరోకోణం వెలుగుచూసింది. రిటైర్డ్ డిజిపి కోటేశ్వర్ రావు , ఆయన కూతురును ప్రభాకర్ రెడ్డి బెదిరించినట్టు వారు ఆరోపించారు.ఈ మేరకు వారిద్దరూ ఓ తెలుగు మీడియా ఛానల్ కు ఇం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మరోకోణం వెలుగుచూసింది. రిటైర్డ్ డిజిపి కోటేశ్వర్ రావును, ఆయన కూతురును ప్రభాకర్ రెడ్డి బెదిరించినట్టు వారు ఆరోపించారు.ఈ మేరకు వారిద్దరూ ఓ తెలుగు మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఇంతకాలంపాటు రిటైర్డ్ డిజిపి కోటేశ్వర్ రావు ఈ విషయమై ఎందుకు నోరుమెదపలేదనే ప్రశ్నలు కూడ ఉత్పన్నమౌతున్నాయి.

కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి నిజాయితీ గల పోలీస్ అధికారి. ఉన్నతాధికారులు ఆయనను వేధింపులకు గురిచేశారు. మామూళ్ళ కోసం ప్రభాకర్ రెడ్డిని వేధించేవారని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు.

అయితే ప్రభాకర్ రెడ్డి మరణం వెనుక అనేక అనుమానాలున్నాయని ఆయన కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలోనే రిటైర్డ్ డిజిపి కోటేశ్వర్ రావును ప్రభాకర్ రెడ్డి బెదిరించారనే విషయం వెలుగుచూసింది.

Recommended Video

అయితే అసలు ప్రభాకర్ రెడ్డి కేసులో ఏం జరుగుతోంది. ఎవరు చెప్పే విషయాలు వాస్తవాలు. పోలీసులు ఎందుకు ఇంకా కూడ ప్రభాకర్ రెడ్డి కేసులో వివరాలను బయటపెట్టడం లేదని ఆయన కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు.

రిటైర్డ్ డిజిపి కోటేశ్వర్ రావు ను బెదిరించిన ప్రభాకర్ రెడ్డి

రిటైర్డ్ డిజిపి కోటేశ్వర్ రావు ను బెదిరించిన ప్రభాకర్ రెడ్డి

రిటైర్డ్ డిజిపి కోటేశ్వర్ రావు ను కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి బెదిరించారని ఆయన ఆరోపించారు.ఈ విషయమై ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.ఆయనతో పాటు ఆయన కూతురు శ్వేత కూడ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బంజారాహిల్స్ లో ఉన్న తన ఇంటిని కోటేశ్వర్ రావు దినేష్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని అద్దెకు ఇచ్చారు. అయితే కాఫీ షాపును నిర్వహిస్తామని చెప్పి హుక్కా సెంటర్ ను నిర్వహించేవారు.దీంతో కోటేశ్వర్ రావు అభ్యంతరం చెబితే పోలీసులు తమకు తెలసునని కోటేశ్వర్ రావు దినేష్ రెడ్డి చెప్పారు.అయితే ఈ విషయమై దినేష్ రెడ్డికి అనుకూలంగా ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించారని రిటైర్డ్ డిజిపి కోటేశ్వర్ రావు ఆరోపించారు. అయితే తాను ప్రభాకర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. అయితే విషయాన్ని సెటిల్ చేసుకోవాలని చెప్పాడన్నారు.అయితే తనకే ఈ రకమైన పరిస్థితి ఎదురైతే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందని ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించానని ఆయన చెప్పారు.

స్టేషన్ కు రావాలని బెదిరించాడు

స్టేషన్ కు రావాలని బెదిరించాడు

నిబంధనలకు విరుద్దంగా తమ ఇంట్లో హుక్కా సెంటర్ ను, అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున్న ఈ విషయమై తాము బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని రిటైర్డ్ డిజిపి కోటేశ్వర్ రావు కూతురు శ్వేత ఆరోపించారు. పుష్కరాల సమయంలో బంజారాహిల్స్ ఎస్ఐ వినోద్ గౌడ్ వెళ్ళడంతో ప్రభాకర్ రెడ్డి ఇంచార్జ్ ఎస్ఐగా వచ్చానని తనకు చెప్పారని శ్వేత ఓ న్యూస్ ఛానల్ కు చెప్పారు. తమ ఇంట్లో అద్దెకు ఉన్న దినేష్ కు అనుకూలంగా ఎస్ఐ వ్యవహరించాడని ఆమె ఆరోపించారు. తనను స్టేషన్ కు రావాలని బెదిరించినట్టు చెప్పారు. అయితే మహిళ పోలీసులను తీసుకురావాలని కోరానని ఆమె చెప్పారు.

 ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు

ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు

కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడు.బ్యూటీషీయన్ శిరీష కేసులో ఆయన ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ మీడియాలో వచ్చిన ఫోటోలు, దృశ్యాల ఆధారంగా ప్రభాకర్ రెడ్డిని గుర్తించింది శ్వేత. ప్రభాకర్ రెడ్డి గతంలో తమతో వ్యవహరించిన తీరును ప్రస్తావించారు.రిటైర్డ్ డిజిపిగా పనిచేసిన కోటేశ్వర్ రావు ఓ ఎస్ఐ బెదిరిస్తే ఎలా మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. రిటైర్డ్ డిజిపి ఇంట్లో అద్దెకు దిగిన వ్యక్తులపై ఫిర్యాదుచేసినా పోలీసులు ఎందుకు ఆయనకు న్యాయం చేయలేదు.రిటైర్డ్ డిజిపిగా పనిచేసిన వ్యక్తికి ఉన్నతాధికారులతో సంబంధాలు ఉంటాయి.ఈ విషయమై ఆయన వారికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు.ఇంతకాలం పాటు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందనే ప్రశ్నలు కూడ లేకపోలేదు.

 కానిస్టేబుల్ శ్రీనివాస్ సస్పెన్షన్

కానిస్టేబుల్ శ్రీనివాస్ సస్పెన్షన్


కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సస్పెన్షన్ వేటు పడింది. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మరణంపై భిన్న ప్రకటనలు చేయడంతో కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకొంది. శ్రీనివాస్ పై ఆరోపణలున్నాయి. అయితే శ్రీనివాస్ ఎందుకు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మరణంపై వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

English summary
Retired DGP venkateshwar rao alleged on kukunoorpally si Prabhakhar Reddy. Venkateshwar rao and his daughter interviewed a telugu news channel .Si prabhakar Reddy supported illegal activities they alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X