వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీసీపీ కోసం రేవంత్ రెడ్డి ,కోమటిరెడ్డి కొట్టుకోవడం ఖాయం

|
Google Oneindia TeluguNews

ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి ఊడిపోవడం ఖాయమని హుజుర్‌నగర్ నియోజవర్గ ఎన్నికల ఇంచార్జ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ పదవి కోసం రేవంత్ రెడ్డితో పాటు,ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు రొడ్డుపై కొట్టుకుంటారని ఆయన ఎద్దెవా చేశారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు కోమటి రెడ్డి వెంకటి రెడ్డి కూడ ఎన్నికల ప్రచారంలో ప్రజలను అవమానించేలా మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజుర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ అహాంకారానికి బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. కాగ ఓటమి భయంతోనే ఉత్తమ్ కుమార్ కాంగ్రెస్ రాష్ట్ర నేతలను ఎన్నికల ప్రచారంలో దింపాడని ఆయన విమర్శించారు. 21న జరగనున్న ఎన్నికలు జరగనుండడంతో నేటితో ప్రచార పర్వం ముగిసింది. అటు అధికార టీర్ఎస్ పార్టీ ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు హోరాహోరి ప్రచారం నిర్వహించారు.

Revant Reddy and PC Komatireddy Venkatreddy will fight for the PCC post

కాగా ఆర్టీసీ సమ్మెతో పాటు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో తమ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో కూడ కాంగ్రస్ పార్టీలో విభేదాలను పక్కన బెట్టి ఉమ్మడిగా ప్రచారం నిర్వహించారు. ఇక టీఆర్ఎస్ సైతం అంతే దీమాగా ఉంది. అయితే సీఎం కేసీఆర్ బహిరంగసభతో జోష్ నింపాలని భావించిన పార్టీ శ్రేణులకు వర్షం కారణంగా నిరాశ మిగిలింది. కాని ఎన్నికల్లో గెలుపును కైవసం చేసుకుంటామనే దీమాను అధికార పార్టీ సైతం దీమాను వ్యక్తం చేస్తోంది.

English summary
Revant Reddy and PC Komatireddy Venkatreddy will fight for the PCC post on the road , Huzurnagar constituency electoral incharge MLC Palla Rajeshwar Reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X