వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డి టార్గెట్ ఆ ఓట‌ర్ల‌లేనా..? ప‌్ర‌చారంలో దూసుకుపోతున్న వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్న సమయంలో, ఇప్పుడు అదే అంశాన్ని ఎన్నికల ప్ర‌చారంలో అస్త్రాంగా వాడుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. కొడంగల్ ఓటమి తర్వాత రెండేళ్ల వరకూ నిశ్శ‌బ్దంగా ఉండాలనుకున్న రేవంత్ రెడ్డి, హైకమాండ్‌ ఆదేశాలను పాటించి, మల్కాజిగిరిలో బరిలోకి దిగారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, తాడో పేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థులుగా సీనియర్లను బరిలోకి దింపింది. అందులో భాగంగానే రేవంత్‌రె్డికి మల్కాజిగిరి సీటు కేటాయించారు. ప్ర‌చారంలో భాగంగా రేవంత్ రెడ్డి వినూత్నంగా దూసుకుపోతున్న‌ట్టు తెలుస్తోంది.

సీమాంద్రులే టార్గెట్..! భిన్నంగా సాగుతున్న రేవంత్ ప్ర‌చారం..!!

సీమాంద్రులే టార్గెట్..! భిన్నంగా సాగుతున్న రేవంత్ ప్ర‌చారం..!!

గడిచిన ఎన్నికల్లో టీపీసీసీ వ���్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో, మల్కాజిగిరి నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో వున్నారు రేవంత్ రెడ్డి..తన మీద మల్కాజ్ గిరి మాజీ ఎంపీ, ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి బరిలో వున్నారు, రేవంత్ గులాబీ ప్రభుత్వ విధానాల‌పై స‌రి కొత్త అస్త్రాన్ని సంధించ‌బోతున్నారు.

మ‌ల్కాజిగిరిలో సెటిల‌ర్స్ ఎక్కువ‌..! వారినే టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్..!!

మ‌ల్కాజిగిరిలో సెటిల‌ర్స్ ఎక్కువ‌..! వారినే టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్..!!

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం దేశంలోనే అతి పెద్దది. అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ నియోజకవర్గ పరిధిలో స్థిరపడి ఓటర్లుగా ఉన్నారు. 2014 ఎన్నికలలోనే టీడీపీ తరపున రేవంత్ ... మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలనుకున్నారు. అది ఇప్పుడు సాధ్యమైంది. అభ్యర్థిత్వం ఖరారు చేసినప్పటి నుంచి, ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రముఖ నేతల్ని కలిసి మద్దతు కోరుతున్నారు, అందులో భాగంగానే జ‌న‌స‌మితి అధినేత కోదండరామ్, టీడిపి సీనియ‌ర్ నేత దేవేందర్ గౌడ్, చాడ వెంకట రెడ్డిలను కలిసి మ‌ద్ద‌త్తు అడిగారు.కీలక ప్రాంతాల్లో ఉద్ధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచార వ్యూహం మాత్రం విభిన్నంగా సాగుతోంది.

ప్ర‌చారంలో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి..! అదికార పార్టీ విధానాల‌పై విమ‌ర్శ‌లు..!!

ప్ర‌చారంలో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి..! అదికార పార్టీ విధానాల‌పై విమ‌ర్శ‌లు..!!

మల్కాజిగిరి నియోజవర్గంలో అన్ని రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా సీమాంధ్రులు ఎక్కువగా ఉంటారు. ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ లాంటి నియోజకవర్గాలన్నీ ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాంశాలు వేరు, ఇప్పుడు వేరు కాబట్టి, ఓటింగ్ ప్రయారిటీ మారబోతోందని చెబుతున్నారు. కొద్ది రోజులుగా.. ఏపీ రాజకీయాల ప్రభావం హైదరాబాద్‌పై పడుతోంది. సీమాంధ్రకు చెందిన ఆస్తులున్న వారిని బెదిరించి.. వైసీపీకి మద్దతుదారులుగా మారాలన్న హెచ్చరికలు చేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే తన పరిధిలోని సీమాంధ్ర ఓట్లన్నీ తనకే వెయ్యాలని రేవంత్ కోరుతున్నట్టు తెలుస్తోంది.

సీమాంద్రుల‌క�� రేవంత్ భ‌రోసా..! ఒక్క‌సారి గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి..!!

సీమాంద్రుల‌క�� రేవంత్ భ‌రోసా..! ఒక్క‌సారి గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి..!!

తనను గెలిపిస్తే సీమాంధ్రులకు ఆపద రాకుండా చూసుకుంటానని రేవంత్ ముందుకు వెళుతున్నారు. భవిష్యత్ లో రాహుల్ ప్రధాని అవుతారని, మల్కాజ్ గిరి ని పూర్తి అభివృద్ధి చేసే బాధ్యత తనదని ప్రచారాల్లో చెబుతున్నారు రేవంత్. ఈ తరుణంలో రాహుల్ ప్రధాని అయితే హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిచేయాలన్న డిమాండ్‌ను, రేవంత్ తెరపైకి తీసు���ు వస్తారా, అన్న చర్చ ప్రారంభమయింది. కాంగ్రెస్ గెలిస్తే.. హైదరాబాద్‌లో కొత్త మార్పులు వస్తాయని రేవంత్ చెబుతున్నారు. ఇప్పటికే ఆస్తులున్న ఆంధ్రులను బెదిరిస్తున్నారనే ప్రచారం జరుగుతూండటంతో, వారికి అభయం ఇచ్చేలా, రేవంత్ ప్రచార వ్యూహం ఖరారు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

English summary
Reavant Reddy is going forward to win over the Seemandhra voters in Malkaji giri lok sabha constancy. Rahul is the prime minister in the future and congress is the responsibility of developing the Malkajgari, Revanth says in campaigns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X