వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారి జెండాలే వేరు అజెండా ఒక్కటే.. బీజేపీ, టీఆర్ఎస్‌పై రేవంత్ ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీఆర్ఎస్, బీజేపీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీల వైఖరి గల్లీలో లొల్లి .. ఢిల్లీలో అలయ్ బలయ్ మాదిరిగా ఉందని విమర్శించారు. వాటి మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపణలు చేశారు. బయటకు తాము పొట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తారని తెలిపారు. కానీ వారి విధానం, ఎజెండా ఒక్కటేనని విమర్శించారు.

ఎన్నడూ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని సంతోష్ .. ప్రత్యేక విమానంలో వెళ్లీ మరీ ఆర్టీఐ సవరణ బిల్లుకు మద్దతు పలికారని గుర్తుచేశారు రేవంత్ రెడ్డి. బీజేపీతో టీఆర్ఎస్ కలువలేదన్న అసదుద్దీన్ ఓవైసీ దీనిపై ఏం చెప్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పై పోరాడుతామన్న జితేందర్ రెడ్డి, డీకే అరుణం ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. దీంతో ఆ పార్టీ అధినేతలే కాదు నేతలది కూడా ఒకటే వైఖరి అని అర్థమవుతుందన్నారు.

revanth fire on bjp, trs

కేసీఆర్, అమిత్ షా కలిసి డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ మీద ఉన్న సహార కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని ఈ సందర్భంగా అడిగారు. మావన అక్రమ రవాణ కేసులో జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే కేసు ఉన్న హరీశ్ రావుపై చర్యలెందుకు తీసుకోలేదని కొశ్చన్ చేశారు. కాశేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని .. కానీ దానిపై విచారణకు బీజేపీ ఎందుకు ఆదేశించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అంటే భయమా ? లేదంటే ప్రేమ అని ప్రశ్నించారు. ఇది వారి అంతర్గత ఒప్పందానికి నిదర్శనం కాదా అని ఫైరయ్యారు.

English summary
Congress leader Revant Reddy Fire on TRS and BJP. The attitude of the two parties has been criticized. It was alleged that there was an internal agreeent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X