
మళ్లీ చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి.!ఈ సారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదంటున్న కాంగ్రెస్.!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి మళ్లీ చంచల్ గూడ జైలుకు వెళ్లారు. గత రెండు నెలల్లో రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలుకు వెళ్లడం ఇది రెండోసారి. మే ఏడో తారీఖున జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నాయకులతో ములాఖత్ అయ్యేందుకు ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. తాజాగా శుక్రవారం కూడా రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో హింసకు కారణమైన అగ్ని వీరులను పోలీసులు జైలుకు తరలించారు. వీరి తరుపున న్యాయ సహాయం అందించేందుకు రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలుకు వెళ్లారు.

ఆర్మీ నిరుద్యోగుల జైల్లో పెట్టడం దారుణం.. విద్యార్ధుల ములాఖత్ కోసం చంచల్ గూడ జైలుకు వెళ్లిన రేవంత్..
సైనిక సంప్రదాయాలని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంట్రాక్ పద్దతిలో అగ్నిపథ్ ద్వార నాలుగు సంవత్సరాలు సైనికుల్ని తీసుకోవడం లోపభూయిష్టంగా ఉందన్నారు. అగ్నిపథ్ కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేస్తుందన్నరు రేవంత్ రెడ్డి. అగ్నిపథ్ కి వ్యతిరేకంగా 27 వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా అని నియోజకవరాగాల్లో సత్యాగ్రహ దీక్షలు చేయబోతున్నట్టు ప్రకటించారు. అన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జ్ ల ఆధ్వర్యంలో 10 గంటల నుండి 1 గంట వరకు సత్యాగ్రహ దీక్షలు చెయాలని ఆదేశాలు జారీ చేసారు రేవంత్ రెడ్డి.

విద్యార్ధులను జైల్లో పెట్టడం పైశాచికత్వం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తిన పీసిసి ఛీఫ్..
దేశంలో అత్యంత కీలకమైనది రక్షణ శాఖ అని, అగ్నిపథ్ తీసుకురావడం దేశ భద్రతకు ప్రమాదమన్నారు రేవంత్ రెడ్డి. యువత తమ భవిత ఎక్కడ అంధకారమవుతుందోననే ఆవేదనతో ప్రభుత్వ ఆస్తులని ధ్వసం చేశార తప్ప మరో కోణం ఉండి ఉండకపోవచ్చన్నారు రేవంత్ రెడ్డి. దేశ వ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు రేవంత్ రెడ్డి. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిపై బనాయించిన కేసులను ఎత్తివేయాలని రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు.

విద్యార్ధుల భవిష్యత్ అందఃకారం.. వెంటనే విడుదల చేయాలన్న రేవంత్ రెడ్డి
అంతే కాకుండా తెలంగాణ విద్యార్దులపై గులాబీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. విద్యార్థుల మనోభావాలను అర్థం చేసుకోకుండా హింసకు పాల్పడ్డారన్న నెపంతో కేసులు బనాయించి జైల్లో పెట్టడం అమానుష చర్య అన్నారు రేవంత్ రెడ్డి. అగ్నిపథ్ విధానం వల్ల నాలుగు సంవత్సరాల సర్వీస్ తర్వాత మళ్లీ నిరుద్యోగులుగా మారే అవకాశాలు ఉన్నందునే విద్యార్థులందరూ అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. విద్యార్ధుల మనోభావాలను అర్ధం చేసుకోకుండా కేంద్ర బీజేపి ప్రభుత్వంతో చేతులు కలిపి విద్యార్ధుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతోందని రేవంత్ మండిపడ్డారు.

విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. న్యాయ సహాయం అందిస్తామన్న రేవంత్
ఇదిలా ఉండగా రాజకీయ లబ్ది కోసం వరంగల్ లో చనిపోయిన యువకుడి అంతిమ యాత్రలో టిఆరెస్ పాల్గొందన్నారు రేవంత్ రెడ్డి. చనిపోయిన విద్యార్థిపై అంత ప్రేమ చూపిస్తున్న గులాబీ నేతలు ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతపై ఎందుకు కేసులు పెట్టారని రేవంత్ నిలదీసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులపై పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఉద్యమం చేస్తూ అరెస్ట్ అయిన యువకుల్ని చంచల్ గూడ జైల్ కి తరలించండం దారుణమన్నారు రేవంత్ రెడ్డి. అరెస్టు ఐన విద్యార్ధులు గానీ, వారి తల్లిదండ్రులు గానీ న్యాయ సహాయం కోసం 9919931993 కి ఫోన్ చేయొచ్చన్నారు రేవంత్ రెడ్డి.