వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండను ఢీకొట్టాలనుకుని: కాంగ్రెస్ బలం పెంచి.. మోత్కుపల్లికి ఛాన్స్ ఇచ్చిన రేవంత్?

బీజేపీ ఎప్పటికీ ఓట్లు చీల్చే పార్టీయే తప్ప క్షేత్రస్థాయిలో అంతా సత్తా లేదని, టీడీపీ ఇప్పట్లో పుంజుకోవడం అనేది అసాధ్యం అన్న భావనకు వచ్చేలా చేసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ లోకి వెళ్లి రాజకీయంగా లబ్ది పొందాలనుకున్న టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనూహ్యంగా యూటర్న్ తీసుకోవడంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దూకుడుగా ముందుకెళ్లే తత్త్వం ఉన్న రేవంత్.. ఇలా వెనక్కి తగ్గడంపై కొంతమంది ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు.

గండం గట్టెక్కిస్తారా?: బాబు రేవంత్ వైపా!, సీనియర్ల వైపా!.. అదే జరిగితే?గండం గట్టెక్కిస్తారా?: బాబు రేవంత్ వైపా!, సీనియర్ల వైపా!.. అదే జరిగితే?

Recommended Video

Revanth Reddy VS TDP senior leaders బాబు రేవంత్ వైపా!, సీనియర్ల వైపా! అదే జరిగితే? | Oneindia Telugu

రాజకీయంగా తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీ.. ఇంతకుమించి తనను ఎదగనివ్వదని రేవంత్ భావించారు కాబట్టే పార్టీ మార్పు నిర్ణయానికి వచ్చి ఉంటారు. కాంగ్రెస్‌తో జతకలిస్తేనే.. తన భవిష్యత్తు రాజకీయాలకు పదును ఉంటుందని భావించారు. ఆ మేరకు ప్రయత్నాలు కూడా చేసిన ఆయన.. ఎక్కడ భంగపడ్డారో తెలియదు కానీ హస్తంతో దోస్తీకి వెళ్లట్లేదని డ్రామాకు తెరదించారు.

మోత్కుపల్లికి ఛాన్స్?

మోత్కుపల్లికి ఛాన్స్?

రేవంత్ తీసుకున్న అనూహ్య యూటర్న్ పార్టీలోని సీనియర్లకు అవకాశం ఇచ్చినట్టయింది. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినా.. ఆ పార్టీకి కావాల్సినంత బూస్టింగ్ ఇచ్చినట్టయింది. తమ ప్రత్యర్థి బలం పెంచాడన్న విషయంలో రేవంత్ పై సీనియర్లంతా గుర్రుగా ఉన్నారు.

రేవంత్ ఇప్పుడు టీడీపీలోనే కొనసాగినా.. ఆయన్ను కాంగ్రెస్ తో ముడిపెట్టి చూసే దృక్పథంతోనే సీనియర్ల ఆలోచనలు ఉంటాయి. ఇప్పటికి రేవంత్ ను నమ్ముకుని నష్టపోయింది చాలు కాబట్టి.. కీలక బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించాలని సీనియర్లు కోరే అవకాశం లేకపోలేదు.

'వర్కింగ్ ప్రెసిడెంట్' నుంచి తప్పిస్తారా?:

'వర్కింగ్ ప్రెసిడెంట్' నుంచి తప్పిస్తారా?:

రేవంత్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పించాలని బలంగా కోరుకునేవాళ్లలో మోత్కుపల్లి నరసింహులు, అరవింద్ గౌడ్ ముందు వరుసలో ఉన్నారు. తొలి నుంచి రేవంత్ ధోరణి అంటే మోత్కుపల్లికి ఏమాత్రం గిట్టని వ్యవహారమే. అయినా సరే కలహాల కాపురాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి మోత్కుపల్లి వెనక్కి తగ్గేలా లేరు. అధినేతతో తాడో పేడో తేల్చుకుని రేవంత్‌ను బాధ్యతల నుంచి తప్పించేందుకే ఆయన పట్టుబట్టకపోరు.

మోత్కుపల్లికి అది ప్రతికూలం:

మోత్కుపల్లికి అది ప్రతికూలం:

రేవంత్‌ను గనుక పార్టీ కీలక బాధ్యతల నుంచి తప్పిస్తే.. మోత్కుపల్లికి ఆ అవకాశం దక్కే సూచనలున్నాయి. ఇన్నాళ్లు జూనియర్ నీడలో తాను పనిచేయడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మోత్కుపల్లి.. తానే పార్టీ బాధ్యతలను మోసేందుకు సిద్దమవుతున్న సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అయితే యువతను ఆకర్షించడంలో రేవంత్ రెడ్డి కొంత ముందు వరుసలో ఉండటం ఆయనకు ప్రతికూలం కావచ్చు.

 కొండను ఢీకొట్టాలనుకుని:

కొండను ఢీకొట్టాలనుకుని:

మాటకు మాట ధీటుగా బదులివ్వడం.. అవసరమైతే ఎంతకైనా దిగజారి వ్యాఖ్యలు చేయడమే ఈరోజుల్లో నేతలకు ఎక్కువ ఫోకస్ కల్పిస్తున్న అంశాలు. రేవంత్ కూడా ఆవిధంగానే ఎక్కువ ఫోకస్ అవుతున్నారు. కేసీఆర్ సర్కార్ విధి విధానాల కన్నా వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సందర్భాలే ఎక్కువ. కేసీఆర్ లాంటి రాజకీయ చతురతను రేవంత్ నుంచి ఇప్పటివరకు చూడలేదు.

కాబట్టి సీఎం కావాలన్న ఆయన ఆశయానికి నోరు ఒక్కటే సరిపోదు. అందుకే చాలామంది రాజకీయ విశ్లేషకులు రేవంత్ సాహసాన్ని 'కొండను ఢీకొడుతున్న పొట్టేలు'గా అభివర్ణించారు. కాంగ్రెస్ లోకి వెళ్లడం ద్వారా తన భవిష్యత్తును కేసీఆర్ కు ధీటుగా మలుచుకోవాలని రేవంత్ భావించారు కానీ వాస్తవంలో ఆయనకు ఎదురైన పరిణామాలు అందుకు ప్రతికూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ నుంచి సరైన భరోసా లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోవడం కంటే టీటీడీపీలో కొనసాగడమే బెటర్ అని ఆయన భావించి ఉండవచ్చు. లేదా.. తాత్కాళికంగానే తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుని ఉండవచ్చు.

 కాంగ్రెస్ బలం పెంచి:

కాంగ్రెస్ బలం పెంచి:

కాంగ్రెస్ లోకి రేవంత్ వస్తే పరిణామాలు ఎలా ఉండేవో కానీ.. ఆయన వస్తున్నారన్న ప్రచారంతో ఆ పార్టీ లాభపడింది. ముఖ్యంగా తెలంగాణలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని మిగతా పొలిటికల్ పార్టీలు కూడా భావిస్తున్నాయన్న ఆలోచన కలిగేలా చేసిందీ ప్రచారం. బీజేపీ ఎప్పటికీ ఓట్లు చీల్చే పార్టీయే తప్ప క్షేత్రస్థాయిలో అంతా సత్తా లేదని, టీడీపీ ఇప్పట్లో పుంజుకోవడం అనేది అసాధ్యం అన్న భావనకు వచ్చేలా చేసింది. ఆవిధంగా రేవంత్ రెడ్డి పెట్టిన చిచ్చు కాంగ్రెస్ బలాన్ని పెంచడానికి మాత్రం బాగానే ఉపయోగపడింది.

English summary
Congress party got more mileage from Revanth Reddy party jumping issue, At the same time TDP leader Motkupalli trying to take over party responsibilites
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X